తెలంగాణ

బోయ జంగయ్య కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: ప్రముఖ రచయిత, కవి బోయ జంగయ్య(74) శనివారం రాత్రి కన్నుమూశారు. ప్రఖ్యాత నవలా రచయితగా, కవిగా ప్రసిద్ధి చెందిన జంగయ్య రెండు మాసాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో ఆయన రచనలు చేసినప్పటికీ, కథలు, నవలా రచయితగానే ఆయన ఎక్కువగా కీర్తి గడించారు. దళిత వాదాన్ని, మానవతా వాదాన్ని ప్రస్ఫుటంగా ప్రతిఫలింపజేస్తూ రచనలు చేసిన వారిలో జంగయ్య అగ్రగణ్యులు. ఆయన రాసిన ‘జాతర’ నవల మైసూరు విశ్వవిద్యాలయంలో బీ ఏ ఎడ్ పాఠ్యాంశంగా కూడా బోధించారు. మరో రచన ‘గొర్రెలు’ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ తరగతిలో పాఠ్యాంశంగా బోధించారు. 2003లో జంగయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. జగడం, ఆలోచించండి, దున్న, చీమలు, తెలంగాణ వెతలు, బోజ కథలు వంటి కథలు, నవలలు జంగయ్య ప్రతిభకు తార్కాణాలు. పిల్లల కోసం ఆయన అనేక రచనలు చేశారు. ఏడాదికి ఒక రచన అయినా పిల్లల కోసం చేయాలని ఆయన తాపత్రయ పడ్డారు. మనవడు చెప్పిన కథలు, గుజ్జనగూళ్లు, ఆటలపాటలు.. వంటివి జంగయ్య కలం నుంచి జాలువారిన బాలల కథలు, గేయ సంపుటులు. అంబేద్కర్, గుర్రంజాషువా, కే ఆర్ నారాయణన్, బాబూ జగ్జీవన్ రామ్‌ల జీవిత కథలను రచించారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.