తెలంగాణ

కాంగ్రెస్ నేతల చలో కర్నాటక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ‘చలో కర్నాటక’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆర్‌డిఎస్ వివాదం పరిష్కారం, జూరాలకు 3 టిఎంసిల నీటి విడుదల అంశాలపై చర్చించేందుకు ఈ నెల 10న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ కానున్నారు. అంతకు ముందు రోజు (9న) కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆర్‌డిఎస్ వద్ద ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, జె. గీతారెడ్డి, ఎ. సంపత్ కుమార్, సి. వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 10 మంది రైతులతో బృందం వెళ్ళనున్నట్లు కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. గొంతెండిపోయిన మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు మంచి నీరు అందించేందుకు నారాయణ్‌పూర్ నుంచి జూరాలకు 3 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కోరనున్నారు. ఇటీవల టి.కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కలిసినప్పుడు ఆర్‌డిఎస్ వివాదం, నారాయణ్‌పూర్ ప్రాజెక్టు ద్వారా జూరాలకు విడుదల చేయడం గురించి చెప్పారు. అందుకు దిగ్విజయ్ సింగ్ వెంటనే కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసి టి.కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి గురించి వివరించారు.