తెలంగాణ

‘మావో’ల బంద్ ప్రభావం నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: మావోయిస్టుల బంద్ విఫలమైంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సైతం బంద్ ప్రభావం కనిపించలేదు. దండకారణ్యంలో గ్రీన్‌హంట్ దాడులు నిలిపివేయాలని, బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరశనగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ నెల 4, 5 తేదీలలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లో మావోలు సంచరిస్తున్నారని, తెలంగాణలో పట్టుకోసం యత్తిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నేపథ్యంలో ఇటీవల నాలుగు రాష్ట్రాలకు చెందిన డిజిపిలు విశాఖలో సమావేశమయ్యారు. మావోయిస్టులు ప్రతీకార చర్యకు పాల్పడకుండా దండకారణ్యంలో అదనపు బలగాలను మొహరించి, గ్రీన్ హంట్ దాడులు కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మావోయిస్టు కేంద్ర కమిటీ దండకారణ్యంలో గ్రీన్‌హంట్ దాడులు నిలిపివేయాలంటూ రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు రాష్ట్రాల పోలీసులు మావోల బంద్‌పై ఉక్కుపాదం మోపారు. సరిహద్దు రాష్ట్రాలతోపాటు ఉత్తర తెలంగాణలో గ్రీన్‌హంట్ కూంబింగ్ చేపట్టారు. దీంతో మావోల రెండ్రోజుల బంద్ పూర్తిగా విఫలమైంది.