తెలంగాణ

ట్రిపుల్ ఐటి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మే 5: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో 2016-17 సంవత్సరానికిగాను ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభమవుతుందని యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం యూనివర్సిటీలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించే విద్యార్థులకు 2015-16 సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
బాసర యూనివర్సిటీ పరిధిలో వెయ్య సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆర్‌జెయు కెటి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు నమూనాను భర్తీచేయాల్సి ఉంటుందని, దీనికి విద్యార్థికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎస్ ఎస్‌సి మెమోతో పాటు కుల, ఆదాయ ధృవీకరణపత్రాలను జతచేయాలని ఆయన సూచించారు. 2008 సంవత్సరంలో బాసరలో ట్రిపుల్ ఐటి ప్రారంభమైనప్పటి నుండి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని, విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యతోపాటు యోగా, సంగీతం, తదితర క్లాసులను సైతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.