తెలంగాణ

పసిపిల్లల మృతిపై స్పందించిన సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 3: దప్పికతీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లుదొరక్క ఇద్దరు పసిపిల్లలు తడారిన గొంతులతో చెన్నూర్ మండలంలో మృతి చెందిన సంఘటన ప్రభుత్వాన్ని కదిలించివేసింది. దాహార్తితీర్చుకోలేని స్థితిలో ఇద్దరు పిల్లలు అశోక్ (12), మధు (8) అనే ఇద్దరు సోదరులు మృతి చెందగా, నీళ్లు తెచ్చేందుకు అడవికి వెళ్ళి కొన ఊపిరితో ఆసుపత్రి పాలైన తల్లి వేలాది లచ్చు మంగళవారం కోలుకొని ఇంటికి చేరుకుంది. అయితే తాగేందుకు నీళ్లు దొరక్క మృతిచెందిన ఇద్దరు పసిపిల్లల సంఘటనపై రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులు తీవ్రంగా చలించిపోయారు.
ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు అధికారులతో కలిసి మంగళవారం చెన్నూర్ మండలం లింగంపల్లి గిరిజన గూడెంకు వెళ్ళి మృతుల తల్లి లచ్చుబాయిని కలిసి ఓదార్చారు. జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే గాక పేదరికంలో మగ్గుతున్న లచ్చు కుటుంబానికి బాసటగా రూ.లక్ష చెక్కును అందజేశారు. అంతేగాక కూతురు పెళ్ళి కోసం వెంటనే కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.51వేలు తక్షణమే అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరపున బాధిత గిరిజన కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇళ్లును మంజూరి చేస్తామని ఓదేలు తెలిపారు. ఇదిలా ఉంటే గిరిజన కుటుంబంలో జరిగిన దారుణ ఘటనపై స్పందించిన ఉట్నూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ లచ్చు కూతురు సునీతకు ఐటిడిఏ తరపున గిరిజన శాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం వెంటనే అందిస్తామని ప్రకటించారు.

పిల్లలు కోల్పోయిన బాధితురాలు లచ్చుకు రూ. లక్ష చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్ నల్లల ఓదేలు