తెలంగాణ

ఆర్టీసిని లాభాల బాటలో నడిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని ఆ సంస్థకు తొలి చైర్మన్‌గా నియమితులైన సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తనపై ఉంచి అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తానని అన్నారు. శుక్రవారం నాడిక్కడ బస్‌భవన్‌లో టిఎస్‌ఆర్టీసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, భారీ సంఖ్యలో తెరాస కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ పదవీ స్వీకారోత్సవానికి విచ్చేశారు. బస్‌భవన్ మొత్తం కిక్కిరిసి కోలాహలంగా మారింది. టిఎస్‌ఆర్టీసి జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ జి.వి.రమణారావు చైర్మన్‌కు సాదరంగా స్వాగతం పలికారు. చైర్మన్ చాంబర్‌లోకి ఆయనను జెఎండి, ఆర్టీసి ఈడిలు, ఇతర అధికారులు తీసుకెళ్లారు. బాధ్యతల స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఆర్టీసి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ సహకారంతో కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ఆర్టీసికి తొలి చైర్మన్‌గా తనను నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆర్టీసిలోని కార్మిక, అధికార, సిబ్బంది అందరిని కలుపుకుని పని చేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎంపి బాల్కసుమన్, జిహెచ్‌ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు శాసనసభ్యులు, తెరాస నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై చైర్మన్ సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.