తెలంగాణ

తనిఖీలు తప్పవు.. అడ్డుకుని తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: పోలీసులతో కాలేజీల తనిఖీలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు మరోమారు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ పరిధిలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మంగళవారం నాడు కొత్తపేటలోని జగజ్జీవన్‌రామ్ హాలులో సమావేశమై పోలీసులను క్యాంపస్‌లలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని నిర్ణయించినట్టు యాజమాన్యాల జాక్ కన్వీనర్ ఇ రమణారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎన్ గౌతంరావు, ఫార్మసీ కాలేజీల అధ్యక్షుడు డాక్టర్ కె. రాందాస్, డిగ్రీ కాలేజీల యాజమన్యాల ప్రధానకార్యదర్శి లక్ష్మారెడ్డి, విజయభాస్కరరెడ్డి తదితరులు పాత్రికేయులతో మాట్లాడారు. గురువారం నుండి పోలీసు బృందాలను పంపించాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు డిజిపికి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రమాణాలను కాపాడేందుకు ఎప్పటికపుడు విద్యాసంస్థల తనిఖీలు సహజంగా జరిగే ప్రక్రియేనని అందులో భాగంగానే ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్టు రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. కాగా పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో క్యాంపస్‌ల్లోకి అనుమతించరాదని యాజమాన్యాలు నిర్ణయించాయి. ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగిస్తే మే 1న జరిగే టెట్, మే 2న జరిగే ఎమ్సెట్ పరీక్షలకు కేంద్రాలను కేటాయించకుండా అడ్డుకోవాలని కూడా నిర్ణయించాయి.

టిఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోండి

సిఇసికి కాంగ్రెస్ ఫిర్యాదు

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఖమ్మం జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘనికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నజీమ్ జైధీతో ఈ బృందం మంగళవారం ఉదయం భేటీ అయ్యింది. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ పాలేరు ఉప ఎన్నికకు బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలి, లేదా ఓటింగ్ మిషన్లకు ప్రింటర్ జత చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.
పాలేరు ఉప ఎన్నిక నేపధ్యంలో ఖమ్మం మున్సిపాలిటి పరిధిలో టీఆర్‌ఎస్ ప్లీనరీపై సీఈసీ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినట్లు ఉత్తమ్ చెప్పారు. పోలీసులు అధికారపార్టీ కొమ్ముకాస్తున్నారని, కేంద్ర బలగాల అధీనంలో ఎన్నికలు జరగాలన్నారు.
గతంలో ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఏవిధంగా ఉల్లంఘించిందో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
పాలేరు ఉప ఎన్నిక జరుగుతున్న ప్రతి పోలింగ్ బూత్‌లోను సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశామని ఉత్తమ్ తెలిపారు. మరోవైపు బుధవారం ఖమ్మం జిల్లాలో నిర్వహించే టిఆర్‌ఎస్ ప్లీనరీ, బహిరంగ సభ జరపడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లేనని, టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైధీ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

గిరిజన గురుకులాలకు మోక్షం
మంత్రి చందూలాల్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26:ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 50 గిరిజన గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. బడి మానేస్తున్న, చదువుకు దూరమవుతున్న గిరిజన పిల్లల పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్మీడియట్ లో రాష్టస్థ్రాయి ర్యాంకులను సాధించిన గిరిజన గురుకుల విద్యాసంస్థల విద్యార్థులను సచివాలయంలో తన చాంబర్‌లో మంత్రి అభినందించారు. గిరిజన విద్యా సంస్థలు, వసతి గృహాల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు వీలుగా జూన్ నెలలోనే వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అయి వారిని చైతన్య పరచాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎనిమిదేసి చొప్పున, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరేసి చొప్పున, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మొడేసి చూప్పున గిరిజన గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

కెటిఆర్‌తో అధికారుల భేటీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న మంత్రి కె తారకరామారావును పరిశ్రమల శాఖ అధికారులు కలిశారు. నూతన శాఖ చేపట్టిన మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ప్రాథమిక వివరాలను మంత్రికి వివరించారు. పరిశ్రమల శాఖ కింద వున్న సంస్థలు, వాటిలో ఉన్న సమస్యలు, వాటిపట్ల ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను మంత్రి కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. హ్యాండ్లూమ్, చేనేత, జౌళిపై ప్రత్యేకంగా చర్చించారు. పరిశ్రమల శాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు పాటుపడాలని దిశా,నిర్దేశం చేశారు. దేశంలోనే పలు ఆయా రంగాల్లో ఉన్న అత్తుత్తమ పద్దతులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మైనింగ్ శాఖకు చెందిన పరు ఉన్నతాధికారులు కూడా మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలకు మేలు జరగాలని, మైనింగ్‌లో అక్రమాలను ఎంత ఎక్కువగా అరికడితే అంత మంచి జరుగుతుందని మంత్రి కెటిఆర్ హితవు చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ శాఖ ద్వారా కష్టాల్లోవున్న తెంలగాణ ప్రవాస భారతీయులను ఆదుకోవాలన్నదే లక్ష్యంగా ఉండాలన్నారు. ఈ మేరకు ఈ నెల 28న పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖలపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. మంత్రిని కలసిన వారిలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్ సభ్యసాచి ఘోష్, శైలజారామయ్యార్, ఇలంబర్తి, మానికరాజ్, ప్రతిమి మీనాలతోపాటు టిఎస్‌ఐఐసి ఎడి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలో మంగళవారం మంత్రి కెటిఆర్‌తో సమావేశమైన అధికారులు

విద్యుత్ చార్జీల వడ్డన తథ్యం

పాలేరు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం?
భారం రూ.800 నుంచి 1200 కోట్లు ?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణలో విద్యుత్ చార్జీల వడ్డన తప్పనిసరిగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ అసెంబ్లీ ఉప ఎన్నిక అనంతరం చార్జీల వడ్డన వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా అనుకున్నట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలపై ఈ నెలాఖరు లోపల కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించడం ఉప ఎన్నిక దృష్ట్యా వీలు పడకపోవచ్చు. గత నెలలో తెలంగాణ డిస్కంలు రూ. 8589 కోట్ల రెవెన్యూ లోటు ఉందని రూ. 1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ప్రతిపాదనలు టిఎస్‌ఇఆర్‌సిని సమర్పించిన విషయం విదితమే.
ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. కాగా మే నెలలో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ముందు కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించడం వల్ల ఎన్నికలపై సవరించిన విద్యుత్ చార్జీల భారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మే మూడవ వారం తర్వాత కొత్త టారిఫ్ విధానం ప్రకటించి జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఇఆర్‌సిని ప్రభుత్వం కోరవచ్చు.
తెలంగాణ డిస్కంలు ప్రతిపాదించినట్లుగా రూ. 1958 కోట్లు కాకుండా చార్జీల భారాన్ని రూ. 800కోట్ల నుంచి రూ.1200కోట్ల వరకు పరిమితం చేసే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోటు 8589 కోట్లలో రూ. 4500 కోట్ల వరకు ప్రభుత్వం సబ్సిడీని భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.మరో రూ.4వేల కోట్లలో రూ.2500 కోట్లను అంతర్గత సామర్థ్యం ద్వారా నిధులు సమీకరించుకోవాలని టిఎస్‌ఇఆర్‌సి సిఫార్సు చేసే అవకాశం ఉంది. అప్పటికీ రూ.1500 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై పడే ప్రమాదం ఉంది. ఇంతవరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా ఉన్న పరిస్థితులు మారిపోయి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
జూన్ నుంచి అమలయ్యే అవకాశం