తెలంగాణ

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిస్తుందని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం మార్కెటింగ్ శాఖలో వివిధ గ్రేడ్ల కింద సిబ్బంది సుమారు 76 మంది పదోన్నతులు పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుమాట్లాడుతూ అధికారులు రైతుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, రైతు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. మార్కెటింగ్ డైరెక్టర్ శరత్ మాట్లాడుతూ ఉద్యోగస్తులందరూ తమ మార్కెట్‌యార్డుల్లో మొక్కలు నాటాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తలసాని శాఖ మార్చి మంచి పని చేశారు: మర్రి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: వర్తకులను వేధించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి వాణిజ్య శాఖను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తొలగించి చాలా మంచి పని చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జాతీయ విపత్తుల నివారణ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. వ్యాపారులందరి తరపున తాను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని శశిధర్ రెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. వ్యాపార సంఘాలను మంత్రి తలసాని పిలిపించుకుని డబ్బుల కోసం వేధించారని, బెదిరించారని ఆయన విమర్శించారు. బేగంబజార్‌కు చెందిన వ్యాపారుల నుంచి పెద్ద బహుమానం పొందినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. తలసాని జంట నగరాలకే కాకుండా తెలంగాణకు మంత్రినన్న విషయం మరిచిపోరాదని ఆయన తెలిపారు. ఇకనైనా జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలని, లేకపోతే మంత్రి పదవి ఊడిపోయే ప్రమాదం ఉందని ఆయన తలసానిని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల పట్ల శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మంచి నీటిని రైల్వే వ్యాగన్ల ద్వారా తెప్పించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.
గురుకుల విద్యార్థులకు సిఎం అభినందనలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 98.33శాతం మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మెదక్ జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని మహాత్మా జ్యోతి రావ్ పూలే బిసి గురుకుల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులు కె. పావని, ఎస్ పూజ, పి శ్రీజ, ఇ.యతీష్( దౌల్తాబాద్) లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఎంపిసి గ్రూపులో అత్యధికంగా 470 మార్కులకు పావనికి 461 మార్కులు, బైపిసి గ్రూపులో 440 మార్కులకు 433 మార్కులతో పూజ, ఎంఇసిలో 500 మార్కులకు 476 మార్కులతో శ్రీజ, సిఇసిలో 500మార్కులకు 466 మార్కులతో యతీష్ సత్తా చాటారు. వీరిని ముఖ్యమంత్రి అభినందించారు.
కరవుపై నేడు
కాంగ్రెస్ కదనభేరీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించడాన్ని నిరసిస్తూ బుధవారం (27న) రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. రహదారులను దిగ్బంధం చేయాల్సిందిగా టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధర్నాలు నిర్వహించాలని, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, వినతి పత్రాలు అందజేయాలని ఆయన సూచించారు. కరవు నివారణకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్ళు తెరిపించేందుకు గ్రామ, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 23న జరిగిన పార్టీ తొలి నూతన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కెసిఆర్ పాలనలో
బాధల తెలంగాణ
టి.టిడిపి నేతల విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో బంగారు తెలంగాణ రావడమేమో కానీ బాధల తెలంగాణ వచ్చిందని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్ బాబు, పార్టీ నాయకులు బండ్రు శోభారాణి, రాజారాం యాదవ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని వారు మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో కరవు, వడగాల్పులతో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని వారు విమర్శించారు. ఇప్పుడేమో ఖమ్మంలో పార్టీ ప్లీనరీకి సిద్ధమయ్యారని వారు తెలిపారు. మంత్రివర్గంలోని 18 శాఖల్లో ప్రధానమైన 14 శాఖలు కెసిఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయని వారు చెప్పారు. వడగాల్పులతో ఇప్పటికే 231 మృత్యువాత పడ్డారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరవు 443 మండలాల్లో ఉంటే ప్రభుత్వం కేవలం 231 మండలాలనే ప్రకటించిందని వారు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్‌ను మూసి వేసి ఆంధ్ర ప్రాంతానికి చెందిన గాయత్రి షుగర్స్‌కు చెరుకును తరలించారని వారు విమర్శించారు.