తెలంగాణ

వినాశకాలే విపరీత బుద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ‘వినాశకాలే విపరీత బుద్ధి..’ అని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావునుద్దేశించి విమర్శించారు. అది తనకైనా, ఎవరికైనా వర్తిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ నాయకుడు, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పట్ల తన బాధను వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ తరపున ఎన్నికైనందున శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి చేరి ఉంటే బాగుండేదని అన్నారు. ఫిరాయింపుదారులకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉంటే నివారణకు చర్యలు తీసుకోకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రతిపక్షాలను అణచి వేయాలని ప్రయత్నించడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. తాజాగా పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్ రెడ్డి, అజయ్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా స్పీకర్‌కు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌పై కౌన్సిల్ చైర్మన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న
కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ

వడదెబ్బతో 29 మంది మృతి
నల్లగొండ/కరీంనగర్/మహబూబ్‌నగర్/నిజామాబాద్/వరంగల్/ఆదిలాబాద్, ఏప్రిల్ 26: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భాణుడి ప్రతాపానికి 29 మంది మరణించారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 13 మంది వడదెబ్బతో మరణించారు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామానికి చెందిన తెరమాల్ల రాములు( 68) అనే రైతు, చివ్వెంల మండలం తుల్జరావుపేట గ్రామానికి చెందిన పాయిలి హుస్సేన్(33), కట్టంగూర్ మండల పరిధిలోని కలిమేర గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి నర్సిరెడ్డి (75) అనే వృద్ధుడు, అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పాలెల్లి సత్తమ్మ (60) అనే మహిళ, వేములపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన చిట్యాల గురవయ్య(50), దామరచర్ల మండలంలోని వాడపల్లి గ్రామానికి చెందిన కారంపూడి సైదమ్మ(70) అనే వృద్ధురాలు, త్రిపురారం మండల పరిదిలోని అంజన్‌పల్లి గ్రామానికి చెందిన పద్మభద్రమ్మ(65) అనే వృద్ధురాలు, మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో రిక్షాకార్మికుడు ఎస్‌కె.నబీ (50) అనే రిక్షా కార్మికుడు, నడిగూడెం మండలంలోని చనుపల్లి గ్రామానికి చెందిన గరిడేపల్లి లక్ష్మి(80) అనే వృద్ధురాలు, రామాపురం గ్రామానికి చెందిన పప్పుల కోదండయ్య (85) అనే వృద్ధుడు, వెలుగుపల్లి గ్రామ పరిధి రసూల్‌పురం గ్రామానికి చెందిన బచ్చలపూరి యాదయ్య(46), అనే తాపీ మేస్ర్తి, పెద్దవూర మండలం ఊట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కీర్యానాయక్ తండాకు చెందిన రమావత్ హనుమా (35) అనే కూలీ, మఠంపల్లి మండలంలోని హన్మంతులగూడెం గ్రామానికి చెందిన బూచిపల్లి నారాయణమ్మ(60) అనే వృద్ధుడు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గొల్ల హమాలీ బండలయ్య (55) అనే హమాలీ, గద్వాల మండల పరిధిలోని మేళచెరువు గ్రామానికి గొర్రెల కాపరి సాగర్ (44), నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన ఆంజనేయులు (28) అనే యువకుడు, అయిజ పట్టణానికి చెందిన ఎ.బాలస్వామి (59), గద్వాల పట్టణంలోని రెండవ రైల్వేగేట్ దగ్గర ఉన్న దినసరి కూలి చంద్రశేఖర్‌రెడ్డి (39), వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన మద్దెల పిచ్చమ్మ (70) అనే వృద్ధురాలు, ములుగు మండలంలోని కాసిందేవిపేట గ్రామానికి చెందిన ఎన్నిండ్ల కనుకమ్మ(60)అనే మహిళ, చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన మొలుగూరి ఓదయ్య (60) అనే వృద్దుడు, ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన నరేందర్ (38) అనే వ్యక్తి, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన గూడల సత్తవ్వ(52) అనే మహిళ, పెద్దలింగాపూర్‌కు చెందిన కుర్మ చంద్రయ్య (52) అనే వ్యవసాయ కూలి వడదెబ్బతో మృతిచెందరు.