తెలంగాణ

విద్యుత్ చార్జీల వడ్డన తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణలో విద్యుత్ చార్జీల వడ్డన తప్పనిసరిగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ అసెంబ్లీ ఉప ఎన్నిక అనంతరం చార్జీల వడ్డన వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ముందుగా అనుకున్నట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలపై ఈ నెలాఖరు లోపల కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించడం ఉప ఎన్నిక దృష్ట్యా వీలు పడకపోవచ్చు. గత నెలలో తెలంగాణ డిస్కంలు రూ. 8589 కోట్ల రెవెన్యూ లోటు ఉందని రూ. 1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ప్రతిపాదనలు టిఎస్‌ఇఆర్‌సిని సమర్పించిన విషయం విదితమే.
ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. కాగా మే నెలలో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ముందు కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించడం వల్ల ఎన్నికలపై సవరించిన విద్యుత్ చార్జీల భారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మే మూడవ వారం తర్వాత కొత్త టారిఫ్ విధానం ప్రకటించి జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఇఆర్‌సిని ప్రభుత్వం కోరవచ్చు.
తెలంగాణ డిస్కంలు ప్రతిపాదించినట్లుగా రూ. 1958 కోట్లు కాకుండా చార్జీల భారాన్ని రూ. 800కోట్ల నుంచి రూ.1200కోట్ల వరకు పరిమితం చేసే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోటు 8589 కోట్లలో రూ. 4500 కోట్ల వరకు ప్రభుత్వం సబ్సిడీని భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.మరో రూ.4వేల కోట్లలో రూ.2500 కోట్లను అంతర్గత సామర్థ్యం ద్వారా నిధులు సమీకరించుకోవాలని టిఎస్‌ఇఆర్‌సి సిఫార్సు చేసే అవకాశం ఉంది. అప్పటికీ రూ.1500 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై పడే ప్రమాదం ఉంది. ఇంతవరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా ఉన్న పరిస్థితులు మారిపోయి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.