తెలంగాణ

టి-సర్కారుకు ఈసీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: పాలేరు ఉప ఎన్నికలో విజయం సాధించి ఖమ్మం జిల్లాలో పార్టీ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న అధికార తెరాసకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పాలేరు ఉప ఎన్నికల్లో జిల్లాకు చెందిన కీలక అధికార్లు అధికార తెరాసకు అనుకూలంగా పనిచేసే ప్రమాదం ఉందంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ తక్షణం స్పందించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, పాలేరు రిటర్నింగ్ అధికారిని 24 గంటల్లో బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఇసి ఆదేశించింది. సీఈసీ ఆదేశాలు అందుకున్న గంటల్లోనే తెరాస సర్కారు కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులను మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికలకు సంబంధించి అధికారులు, పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఎన్నికల విధానానికి భంగం కలిగే ప్రమాదం ఉందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం ఫిర్యాదు చేసింది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నియమితులైన అధికారులు, పాలేరు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా బరిలోవున్న తుమ్మలకు అనుకూలంగా పనిచేసే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెస్ ఆ ఫిర్యాదులో అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారులను బదిలీ చేయాలని కాంగ్రెస్ ఈసీకి విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, పాలేరు రిటర్నింగ్ అధికారి గణేష్‌బాబులను 24 గంటల్లో బదిలీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, కొత్తగా నియమించదలిచిన వారి పేర్లు సూచించాలని సైతం సిఈసీ ఆదేశించింది. సిఈసి ఆదేశాలపై ప్రభుత్వం గంటల్లోనే స్పందించింది. ఖమ్మం కలెక్టర్‌గా ఎం దానకిషోర్‌ను, రిటర్నింగ్ అధికారిగా వరంగల్ డిప్యూటీ కలెక్టర్ బి శంకర్‌ను నియమించింది. డిజిపి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం డిజిపి కార్యాలయానికి సరెండర్ అవ్వడంతో, ఆయన స్థానంలో ఆర్ రామరాజేశ్వరి నియమితులయ్యారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ ప్రధానంగా మూడు అంశాలపై సిఈసికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో తెరాస ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దని, ప్లీనరీ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించి అధికార దుర్వినియోగానికి పాల్పడతారని ఫిర్యాదు పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని కోరింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగిస్తే రసీదు ఇచ్చే విధానం అమలు చేయాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రభుత్వాధికారులు, పోలీసులను స్వలాభాగానికి ఉపయోగిస్తోందని ప్రధానంగా అభియోగం చేసింది.
chitram...
కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షానవాజ్, ఆర్‌వో గణేష్‌బాబు