తెలంగాణ

ప్రజారోగ్యాన్ని పట్టించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో వివిధ రకాల వ్యాధులతో ఏటా కోట్లాది మంది జనం అనారోగ్యం పాలవుతున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నివారించడానికి వీలున్న వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది మృతి చెందుతున్నారని ఆయన అన్నారు. ప్రజారోగ్యనికి సంబంధించిన మూడు అంశాలను కేంద్రానికి లోక్‌సత్తా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రతిపాదనలు ఇచ్చింది. దేశంలో ప్రతి సంవత్సరం 97 లక్షల మంది మలేరియా బారిన పడుతున్నారని , 25 లక్షల మందికి టిబి సోకుతోందని జెపి అన్నారు. దేశంలో ఏటా ఐదు కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతున్నారని, సగటున ఒక్కొక్కరు వైద్యానికి 40 వేలు ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్పారు. జనరిక్ మందుల వినియోగంతో 75 శాతం మందుల కోనుగోలుపై వ్యయాన్ని నియంత్రించాలని సూచించారు.