తెలంగాణ

ఇంటర్‌లో అన్ని సేవలూ ఆన్‌లైన్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగానూ, అత్యున్నత ప్రమాణాలతో అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ కాలేజీల్లో హాజరును పెంచేందుకు ప్రత్యేక కృషి చేస్తామని, మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఇంటరు ఫలితాలను విడుదల చేసిన తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటర్ విద్యను కూడా పేద విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఉచితంగా అందించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నామని, ఎలాంటి రుసుం లేకుండా ఒకటో తరగతి నుండి ఇంటర్‌వరకూ చదువుకునే వెసులుబాటు ఉందని ఆయన చెప్పారు. అలాగే మెరుగైన వసతులు కల్పించాలని ఆర్‌ఐడిఎఫ్-20లో 140 కోట్ల రూపాయిలు వౌలిక వసతులకు నిరుడు కేటాయించామన్నారు. టాయిలెట్లు, భవనాలకు, నీటి వనరులు కల్పించేందుకు ఈ నిధులు వెచ్చించామని చెప్పారు. ఆర్‌ఐడిఎఫ్-21లో 70 కోట్లు కొత్త భవనాలకు, అదనపు తరగతి గదులకు కేటాయించామన్నారు. 2015-16 సంవత్సరంలో 210 కోట్లు సమకూర్చామని అన్నారు. ఇప్పటికీ 402 ప్రభుత్వ కాలేజీల్లో 17 కాలేజీల్లో పక్కా భవనాలు లేవని, భూమి కూడా లేదని, కలెక్టర్లకు భూమి కేటాయించమని లేఖలు రాశామని, భూమి ఇస్తేవెంటనే కొత్త భవనాలను నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు 22 రకాల సేవలను ఆన్‌లైన్ చేసినట్టు ఆయన తెలిపారు. అక్రమాలకు, పైరవీలకు తావు లేకుండా ఆన్‌లైన్ చేశామని చెప్పారు. బోర్డులో సిసి కెమరాలు కూడా ఏర్పాటు చేశామని, బోర్డు ప్రక్షాళనకు అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు, లైబ్రరీల ఏర్పాటుకు ఆరు కోట్ల రూపాయిలను కేటాయించామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.