తెలంగాణ

అభివృద్ధి ఊసేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలనుపాకలో కానరాని అభివృద్ధి
నెలలు గడిచినా ప్రారంభంకాని పనులు
ఆలేరు, ఏప్రిల్ 22: దేశ విదేశాల్లో గుర్తింపుతో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన కొలనుపాకను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దత్తత తీసుకోవడంతో అభివృద్ధిలో పరుగులు పెడుతుందనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. గత సెప్టెంబర్ 26న సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని దత్తాత్రేయ దత్తత తీసుకుని గ్రామాన్ని సందర్శించి అధికారులతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. గ్రామాభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. గ్రామం మొత్తం సిసి రోడ్లు, ప్రతి ఒక్కరు ఇంటి వసతి, మరుగుదొడ్లు నిర్మింపచేస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని, పాఠశాలకు ఇంటర్నెట్ వసతి కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పన అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రకటించిన హామీల్లో ఆరుమాసాలు గడిచినా ఒక్క పని కూడా క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోలేదు. గ్రామానికి 200 మరుగుదొడ్లు మంజూరైనప్పటికి 10మాత్రమే పూర్తయ్యాయి. గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపైన చేరుతుంది. నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణ కోసం ఎదురుచూస్తున్నారు. పంచాయతీ బోర్లతో మంచినీటి సరఫరా జరుగుతుండగా పంచాయతీ ఆధ్వర్యంలోని ఫిల్టర్ నీటిని మూడు రూపాయలకు క్యాన్ చొప్పున ప్రజలకు అందిస్తున్నారు. 2006లో అప్పటి ఎమ్మెల్యే కె.నగేష్ ప్రారంభించిన కృష్ణా మంచినీటి పథకం పనులు నేటికి పురోగతిలోనే ఉన్నాయి. వాటర్ గ్రిడ్ ద్వారా నీటి సరఫరాకు పనులు ప్రారంభదశలో ఉన్నాయి. భిన్న మతాలకు సంస్కృతులకు నెలవైన కొలనుపాక కేంద్ర మంత్రి దత్తత తీసుకున్నప్పటికి అభివృద్ధిలో మాత్రం ముందడుగు పడకపోవడంతో గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కొలనుపాకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

చింత తీరని చింతకుంట్ల
ఎంపి గుత్తా దత్తత గ్రామంలో ముందుకు సాగని అభివృద్ధి
సమీక్షలతోనే కాలం గడుపుతున్న అధికారులు

దేవరకొండ, ఏప్రిల్ 22: సంసద్ ఆదర్శ గ్రామ పథకం క్రింద నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి దత్తత తీసుకున్న దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామంలో అభివృద్ధి పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. గ్రామాభివృద్ధికి అధికారులు 23.73 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వివిధ పనులు చేపట్టాలని నివేదికలు తయారు చేసినా 25 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఇప్పటికే పదుల సార్లు గ్రామంలో సమీక్షలు జరిపిన అధికారులు అభివృద్ధి పనులను మాత్రం ముందుకు తీసుకు పోలేకపోతున్నారు. గ్రామానికి కృష్ణా జలాలు అందని ద్రాక్షగానే మారాయి. దాదాపు 3500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి సొంత భవనం లేదు. ఎఎన్‌ఎం అద్దె గృహాన్ని తీసుకొని సబ్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. సబ్‌సెంటర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పినా ఇంతవరకు ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడతామని చెప్పినా ఇంతవరకు పునాది కూడా తీయలేదు. గ్రామంలో ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు, అభివృద్ధి కోసం శాఖల వారిగా అధికారులు పంపిన నివేదికలు ఆచరణకు నోచుకోలేదు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పనులకు 7.12 కోట్లు, పంచాయతీరాజ్ 15 కోట్లు, ఇరిగేషన్ 72.37 లక్షలు, విద్యుత్ శాఖ 40.02 లక్షలు, వెటర్నరీ బిల్డింగ్ కోసం 20 లక్షలు, విద్యాశాఖ పనులకు 1.38 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు నివేదికలు అందించారు. మరో 3 లక్షలను మంజూరు చేస్తే పాఠశాల ప్రహరీగోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యుత్‌శాఖకు సంబంధించి కొన్నిచోట్ల పనులు పూర్తయినా పూర్తి స్ధాయిలో పనులు పూర్తి కాలేదు. ఇప్పటికైనా దత్తత గ్రామంలో నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చింతకుంట్ల గ్రామస్థులు ఎంపి గుత్తాను కోరుతున్నారు.

ఆమడ దూరంలో మర్రిగూడ
ఎంపి పాల్వాయ దత్తత గ్రామంలో ప్రతిపాదనలతోనే సరి
మర్రిగూడ, ఏప్రిల్ 22: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంసద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి దత్తత తీసుకున్న మర్రిగూడ గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. 13కోట్ల 58లక్షల రూపాయల నిధులతో సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పటికి ఏ ఒక్క పని కూడా ఆచరణకు నోచుకోలేదు. స్థానికంగా ఎనిమిది కృష్ణా మంచినీటి వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికి వాటిలో ఆరు ట్యాంకులు నిరూపయోగంగా పడివున్నాయి. నాలుగు రోజులకొకసారి మంచినీటి సరఫరాతో ప్రజలు తాగునీటికి తిప్పలు పడుతున్నారు. ఆదర్శ గ్రామం కింద ఏటిఎం సెంటర్, 100 మరుగుదొడ్లు, 30 గొర్రెల రుణాలు తప్ప ఇతర పనులేవి అమలుకు నోచుకోలేదని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆదర్శానికి దూరంగా రెడ్లరేపాక
ఎంపి నర్సయ్యగౌడ్ దత్తత గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే

వలిగొండ, ఏప్రిల్ 22: భువనగిరి ఎంపి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆదర్శ గ్రామ యోజన కింద దత్తత తీసుకున్నప్పటికి గ్రామంలో ఏడాది కాలంగా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఆదర్శ గ్రామనిర్మాణ కార్యాచరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గ్రామంలో పలు కాలనీల్లో నీటి సమస్య కనిపిస్తుండగా, కృష్ణా మంచినీరు గతంలో మాదిరిగానే వారానికి ఒక్కసారి వస్తుండడం త్రాగునీటి సమస్య తీవ్రతకు నిదర్శనం. చెరువులు, వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోయాయ. దీంతో గ్రామస్థులకు సాగు, తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. గ్రామానికి వెళ్లే బిటిరోడ్డు పూర్తిగా కంకర తేలి ఇబ్బందిగా మారింది. మరో రెండు మెటల్ రోడ్లు కూడా కంకర తేలాయి. కృష్ణా నీటి వసతి కోసం పాఠశాలలు ఎదురు చూస్తున్నాయ.