తెలంగాణ

మధ్యాహ్న భోజనంపై మక్కువ తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలంగాణ ప్రభుత్వం వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, విద్యార్థుల నుండి పెద్దగా స్పందన రాలేదు. ఈ కార్యక్రమం గురువారమే తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రారంభమైంది. సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. రాష్టర్రాజధానికి గురువారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 30 శాతం నుండి 40 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని ఒకటోతరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ డైరెక్టర్ జి. కిషన్ తెలిపారు. గురువారం రాత్రి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి తాండవిస్తున్నందువల్ల, ఇతర కారణాల వల్ల ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
అన్నం, పప్పు..
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య అన్నం, పప్పు లేదా కూర, చారు ఇస్తామని మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండల విద్యాధికారి (ఎంఇఓ) కిషన్ తెలిపారు.
ఆంధ్రభూమి ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ, తన పరిధిలో 70 పాఠశాలలు ఉన్నాయని, దాదాపు ఐదువేల మంది విద్యార్థులు రోల్స్‌లో ఉన్నారన్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని ఎంఇఓ కిషన్ వివరించారు.