తెలంగాణ

నర్సన్నపేట దాహం తీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 18: గుడిసె, పెంకుటిల్లు లేకుండా రోడ్లు, తాగునీటి వసతి, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన తరహాలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం సబబే అయినా తాత్కాలిక వసతుల కల్పనలో అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడటంతో జనం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 18వ తేదీన నర్సన్నపేట గ్రామస్థులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో సిఎం కెసిఆర్ స్వయంగా స్పందించి నీటి కష్టాలను కడతేర్చారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం ఉన్న ఇళ్లను కూల్చి వేసి నిర్వాసితులకు గ్రామ శివారులో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ వ్యవస్థను కల్పించారు. నర్సన్నపేట గ్రామ శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేయించిన ఇళ్లకు నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ప్రజలు రోడ్డెక్కి సంచలనం రేకెత్తించారు. గ్రామంలో చెడిపోయిన బోరును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయించడంతో పాటు సింగిల్ ఫేస్ మోటార్ల ద్వారా తాత్కాలిక నివాసాల వరకు పైపులైన్లు వేసి నిరంతరాయంగా నీటి సరఫరా చేయిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సమకూరుస్తున్నారు. ఎండలు సెగలు కక్కుతుండటంతో ఇంటి ముందుకే నీరు వస్తుండటంతో గ్రామస్థులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జగదేవ్‌పూర్ మండలంలోని ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడిందని, చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు చొరవ చూపించాలని సిఎం కెసిఆర్ హితవుపలికారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరాకు సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించి పనుల నాణ్యతను పరిశీలించి చూసారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను మే నెలాఖరునాటికి పూర్తి చేయించి సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించినా నిర్దేశిత సమయంలోగా పూర్తి కావడం అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నెల 29వ తేదీతో శుభ ముహూర్తాలు ముగియనుండటంతో తిరిగి సెప్టెంబర్, అక్టోబర్ వరకు శుభముహూర్తాలు లేకపోవడం, ఖరీఫ్‌లో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండటంతో తాత్కాలిక నివాసాల్లో ఉండే జనాలు ఇబ్బందులకు గురవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్న నర్సన్నపేట గ్రామస్థులకు సిఎం కెసిఆర్ స్పందించడంతో దాహం తీరిందని చెప్పవచ్చు.