తెలంగాణ

కల్యాణలక్ష్మి అవినీతి డొంక కదిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంలో జరుగుతున్న అవినీతి డొంకను ఎసిబి అధికారులు ఎట్టకేలకు బయట పెట్టారు. అంతేకాకుండా అక్రమార్కులను జాబితాను జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ కూడా అందజేయడంతో అక్రమార్కులను జైలుకు పంపేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కళ్యాణలక్ష్మి పథకానికి తూట్లు పొడిచిన నలుగురు అక్రమార్కులను ఎస్పీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మల్దకల్ గ్రామానికి చెందిన గచ్చింటి రమేష్, గొల్ల వెంకటేష్‌యాదవ్, గోపాల్, బోయ సిద్దు అనే నలుగురు నిందితులు కళ్యాణలక్ష్మి పథకాన్ని దుర్వినియోగం చేసి పదేళ్ళ క్రితం పెళ్లిళ్ళు జరిగి, వారికి ఆరేడు ఏళ్లకు పైబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి పథకం వర్తింపజేసేలా కుట్ర పన్నారని అన్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి కొత్తగా పెళ్ళి కార్డులు ముద్రించి అక్రమాలకు పాల్పడ్డ నలుగురు వ్యక్తులను ఎసిబి అధికారులు గుర్తించారని, వారి నివేదిక ఆధారంగా వారిని అరెస్టు చేసి విచారించామని, విచారణలో అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైందని ఎస్పీ తెలిపారు. రాజేష్‌కు గ్రామ కార్యదర్శితో పాటు మరో ఇద్దరు అధికారులు సహకరించారని తెలిపారు. నలుగురు నిందితులు కలిసి కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ఆధార్‌కార్డుతో పాటు పెళ్ళి కార్డులు నకిలీవి సృష్టించారని తెలిపారు. నలుగురు నిందితులను ఆరెస్టు చేయగా అక్రమాలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, జిల్లా కలెక్టర్‌కు కూడా ఎసిబి అధికారులు నివేదిక అందించారు.