తెలంగాణ

ఇంత జరిగినా అదే తీరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 21: ఇంత జరిగినా కుక్కతోక వంకరే అన్నట్లుగా మారింది జిల్లాకేంద్రంలోని శిశుగృహ సిబ్బంది తీరు. ఓవైపు ఆయాల అనుచిత ప్రవర్తన యావత్ జిల్లాయంత్రాంగానికే తలవంపులు తేగా, అధికారులు తలలు పట్టుకుంటుంటే, తమ నడవడిని మార్చుకుని విధులపట్ల అంకితభావం ప్రదర్శించాల్సిన సంరక్షకురాలు అనాథబాలలపట్ల అదే తీరును ప్రదర్శించింది. శిశుగృహలోని చిన్నారుల చేతులపై వాతల వైనం బుధవారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి అందులోని 5గురు సిబ్బందిని జిల్లాయంత్రాంగం తొలగించింది. అయినా, విధులు నిర్వహిస్తున్న మిగతావారిలో ఇసుమంతైనా భయం..విధుల నిర్వహణపట్ల చిత్తశుద్ది కానరావటంలేదు. ఆరుగురి సిబ్బంది పని తాము ముగ్గురమే చేస్తున్నామనే భావనతోఅదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి సపర్యల సంగతి దేవుడెరుగు..కాని కనీసం భోజనం కూడా సక్రమంగా వడ్డించటంలేదు. పెద్ద పెద్ద అన్నం ముద్దలను నోటిలో కుక్కుతూ, తినాలని తొందరపెడుతూ ఉద యం పూట విధులు నిర్వహిస్తున్న ఆయా చిన్నారులను ఈసడించుకోవటం ప్రత్యక్షంగా కనిపించిన దృశ్యం. ఆయాలను పరామర్శించేందుకు వచ్చిన మహిళా, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్ విజయేంద్రబోయితో పాటు పలుపార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల ఎదుటే ఈఘటన జరుగగా, ఒక్కసారిగా ఖిన్నులవటం వారివంతైంది. దీనిపై డబ్ల్యుసిడబ్ల్యు డైరెక్టర్ వెంట ఉన్న ఐసిడిఎస్ పిడిని ప్రశ్నించగా అదంతా సాధారణమేనని కొట్టిపారేయటంతో పక్కనే ఉన్న బిజెపి నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని పిడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకదశలో పిడిపై చేయిచేసుకునే స్థాయికి చేరగా, అక్కడే ఉన్న బిజెపి నేత బండిసంజయ్‌కుమార్ వారించారు. శిశుగృహలో జరిగిన ఘటన ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికంతటికి కారణమనే భావన వ్యక్తమవుతుంది.
గాయాలు చేసిన ఆయాల అరెస్టు
అల్లరి చేస్తున్నారనే సాకుతోశిశుగృహలోని చిన్నారుల చేతులపై వేడిచెంచాతో వాతలు పెట్టిన ఆయా పద్మ, స్టవ్‌పై చెంచావేడిచేసిన బుచ్చమ్మలను రెండో పట్టణ పోలీసులు గురువారం అరెస్టుచేసి, కోర్టులో హాజరుపరిచారు.