తెలంగాణ

భలే భలే ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఉప్పల్, డిసెంబర్ 18: అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలంగాణ ఐటి మంత్రి కె.తారక రామారావు అన్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, టి పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్ మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి ఎండి గాడ్గిల్‌తో కలిసి మెట్టుగూడ- ఉప్పల్ మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్‌లో ప్రయాణం చేశారు. అత్యాధునిక వ్యవస్థను పరిశీలించి, రైలు పనితీరు, సౌకర్యాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రోరైలు ప్రయాణం మరువలేని అనుభూతిని, ఆనందాన్ని కలిగించిదని మంత్రులు అభిప్రాయపడ్డారు. అనంతరం మెట్రో డిపోలో జరిగిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే నిర్ణీత సమయంలో మెట్రో పురోగతి సాధించిందన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన మెట్టుగూడ- ఉప్పల్ మార్గంలో వచ్చే కొత్త ఏడాది ప్రథమార్ధంలో మెట్రోరైలును ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. రికార్డులు, రివార్డులతో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామికవేత్తలు ముందుకురావడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో ప్రయాణం సురక్షితంగా, వేగంగా గమ్యానికి చేర్చడమే మెట్రో వ్యవస్థ లక్ష్యమన్నారు. నగరంలో పెరుగుతున్న అవసరాలనుబట్టి మెట్రోరైలు ప్రాజెక్టును శివారు ప్రాంతాల్లోని 200 కిలోమీటర్ల వరకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. తొలివిడతలో ప్రస్తుతం 72 కిలోమీటర్ల నుండి 153 కిలోమీటర్ల వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రూ.14వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం మూడువేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
సుల్తాన్ బజార్‌లో అధిక పరిహారం: డిప్యూటీ సిఎం
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన స్థల యజమానులకు అనుకోనివిధంగా, అధిక నష్టపరిహారం అందజేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైలు రాకతో భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. పాత అలైన్‌మెంట్ ప్రకారమే పనులు చేపట్టనున్నట్టు మంత్రులు వెల్లడించారు. సుల్తాన్‌బజార్‌లో స్థల యజమానులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లించి, వారికోసం ప్రత్యేకంగా హాకర్స్ ప్యారడైజ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మెట్రోరైలు సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం నెంబర్‌వన్‌గా ఉందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి మెట్రోరైలు ప్రాజెక్టు కలికిరాయని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజక్టు కోసం స్థలం ఇచ్చిన రైతులకు త్వరలో అభివృద్ధి చేసిన హెచ్‌ఎండిఏ లేవుట్‌లో ప్లాట్లను పంపిణీ చేయనున్నట్టు హెచ్‌ఎంఆర్ ఎండి ఎన్‌విఎస్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు మంత్రులు ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణించి సంతోషం వ్యక్తం చేశారు.

చిత్రం.. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న మంత్రులు, డిప్యూటీ సిఎం