తెలంగాణ

దేశం కోసం వేలమంది వర్షంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: పౌర చైతన్య వేదిక ‘జాగృత భారత్’ చరిత్ర సృష్టించింది. దేశం కోసం పరితపించే దేశభక్తుల్ని జాగరూకుల్ని చేసి, దేశ ద్రోహులు, విదేశీ దుష్టశక్తుల ఆటకట్టేంచే లక్ష్యంతో నిర్వహించిన తొట్టతొలి సభనే విజయవంతంగా నిర్వహించి, అందరి ప్రశంసలూ చూరగొంది. అప్పటివరకూ మండుటెండ... సభ ప్రారంభమయ్యాక జోరువాన..అయినా సభికులు ఏ ఒక్కరు వెనుదిరిగితే ఒట్టు. వర్షంలోనే వక్తలు ప్రసంగించారు. సభికులు కుర్చీలు నెత్తిన పెట్టుకునే వారి ప్రసంగాల్ని ఆసాంతం విన్నారు. హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణంలో ఆదివారం రెండున్నర గంటల పాటు ఏకబిగిన సాగిన ‘దేశం కోసం’ సభలో కనిపించిన దృశ్యాలివి. ఎలాంటి ఆహ్వానాలు లేకుండానే వేల సంఖ్యలో జనం తరలి రావడంతో ప్రాంగణం కిక్కిరిసి పోయింది. బహిరంగ సభలు జరిగే సమయాన వర్షం పడితే ఆ సభను వాయిదా వేయడమో, లేక జనం వెళ్లిపోవడమో జరుగుతుంది. కానీ తెలుగు లలిత కళాతోరణంలో ఆదివారం సాయంత్రం జరిగిన సభ అందుకు భిన్నంగా సాగింది. ఎంచుకున్న అంశం దేశభక్తితో ముడివడింది కావడం, వక్తల ప్రసంగాలు ఉద్వేగభరితంగా సాగడంతో సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. సభ జరిగినంత సేపూ వందేమాతరం, భారత మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. ప్రధానంగా జెఎన్‌యు సంఘటన, అఫ్జల్‌గురు అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు నినాదాలతో సభ హోరెత్తింది. హాజరైన వారిలో యువకులే ఎక్కువగా ఉండటం..దీని ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. సభ ప్రారంభానికి గంట ముందు నుంచీ జనం రావడం మొదలైంది. వచ్చినవారు వచ్చినట్టుగా సభ పూర్తయ్యే వరకూ కదలకుండా కూర్చోవడం గమనార్హం. ‘దేశం కోసం... కదలిరండి’ అంటూ ‘జాగృతభారత్’ ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ ప్రారంభానికి ముందే భారీ వర్షం కురిసింది. ప్రముఖుల కోసం వేసిన కుర్చీలు తడిసిపోయాయి. ఒక దశలో సభ జరుగుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది. సభ జరగడానికి ముందు ప్రారంభమైన వర్షం కొద్దిసేపు తెరిపి ఇచ్చి, సభ ప్రారంభమైన తర్వాత మళ్లీ మొదలైంది. ప్రముఖ కవి, సినీ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ తొలి పలుకులతో సభ ప్రారంభం కాగానే వర్షం మళ్లీ మొదలైంది. వర్షంలో తడుస్తూనే ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాన వక్త మేజర్ జనరల్ జిడి బక్షి ప్రారంభోపన్యాసం మొదలవగానే మళ్లీ వర్షం జోరందుకుంది. వర్షం పడకుండా భక్షికి నిర్వాహకులు గొడుగు పడితే తనకు గొడుగు అవసరం లేదని ఆయన సున్నితంగా తిరస్కరించి, వర్షంలోనే ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రేక్షకులు లేచి నిలబడి తాము కూర్చున్న ప్లాస్టిక్ కుర్చీలనే తలపై పెట్టుకుని బక్షి ప్రసంగాన్ని విన్నారు. ఇది గమనించిన బక్షి ‘వరుణుడు మనల్ని కరుణించాడు..్భరీ ఎండ కాస్తుండగా, మనం పెట్టుకున్న సభను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఈ పరిస్థితిలో వర్షంలో కొద్దిసేపు ఉండలేమా’ అని అన్నారు. మనం గట్టిగా ఉంటే వరుణుడు కూడా తన ప్రభావం తగ్గిస్తాడని అన్నారు. లాన్స్‌నాయక్ హనుమంతప్ప తల్లిని సన్మానిస్తున్న సమయంలో ప్రముఖ గాయకుడు ప్రసాద్ ఆలపించిన వందేమాతరం గీతం ప్రతి ఒక్కరినీ కదిలించింది. సభికులందరూ గొంతుకలిపి ఈ గీతాన్ని ఆలపించారు. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో మన సైనికులు ఎండ, చలి, వర్షం తదితర ప్రకృతి వైపరీత్యాలకు జడవకుండా నిరంతరం కాపలా కాస్తున్నారన్న విషయాన్ని మరచిపోకూడదన్నారు. బక్షి పిలుపునకు స్పందించిన ప్రేక్షకులు వెంటనే తమ తలలపై పెట్టుకున్న కుర్చీలను కూడా దించేసి, తడుస్తూనే ఆయన ప్రసంగాన్ని విన్నారు. ఆ తరవాత వర్షం నెమ్మదించింది. సభ ముగిసిన అనంతరం వెనుదిరిగిన వెడుతున్న సభికులు దేశభక్తిపై చర్చించుకోవడం కనిపించింది. అలాగే భరతమాత రక్షణకోసం తలపెట్టిన సభకు వర్షంతో వరుణుడు తన మద్దతు తెలియజేశాడని ఓ సభికుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సభ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగడం, సభికుల ప్రసంగాల్లోనూ దేశ భక్తి అడుగడుగునా ప్రస్ఫుటించడం యువతలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించేందుకు, దేశం కోసం మరింతగా పాటుపడాలన్న తపనను పాదుగొల్పేందుకు దోహదం చేసింది.

chitram...

1. హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణంలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘దేశం కోసం’
బహిరంగ సభలో లాన్స్‌నాయక్ హనుమంతప్ప తల్లిని సత్కరిస్తున్న మేజర్ జనరల్ (రిటైర్డ్) జిడి బక్షి,
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా,
డాక్టర్ వంశ తిలక్, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ తదితరులు.

2. వర్షం పడుతుంటే కుర్చీలు తలపై పెట్టుకుని వక్తల ప్రసంగాలు వింటున్న సభికులు