తెలంగాణ

కిమ్స్‌లో ఎక్యూట్ స్ట్రోక్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: నగరంలోని కిమ్స్ హాస్పిటల్‌లో ఎక్యూట్ స్ట్రోక్ సెంటర్‌ను హీరో జూనియర్ ఎన్టీఆర్ బుధవారం ప్రారంభించారు. న్యూరాలజీ విభాగంపైనా, న్యూరో సంబంధిత స్ట్రోక్స్, రోగాలపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఈ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ చైతన్య కార్యక్రమానికి న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా చేయూత నందిస్తోంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన వంతు ప్రయత్నంగా ఆరోగ్యకరమైన సొసైటీ నిర్మాణానికి ప్రచారం నిర్వహిస్తానని అన్నారు. వివిధ రకాల స్ట్రోక్స్‌ను ముందుగానే పసిగట్టేందుకు జరిగే చైతన్య కార్యక్రమంలో తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోలాజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిఎస్ శర్మ, కిమ్స్ ఎండి డాక్టర్ బి.్భస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కిమ్స్ ఆస్పత్రిలో ఎక్యూట్ స్ట్రోక్ సెంటర్ ప్రారంభించి ప్రసంగిస్తున్న ఎన్టీఆర్

భూసేకరణ ఫైళ్లను
స్పీకర్ ముందు పెట్టండి

చంద్రబాబుకు రామచంద్రయ్య లేఖ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూసేకరణ ఫైళ్ళు, సింగపూర్ కంపెనీలతో సాగిస్తున్న సంప్రదింపులు, ఒప్పందాలకు సంబంధించిన వివిధ జీవోలు, ఫైళ్ళను అన్ని పార్టీల నేతలు పరిశీలించేందుకు వాటిని ఏపి కౌన్సిల్ చైర్మన్, ఏపి అసెంబ్లీ స్పీకర్ ముందు పెట్టాలని కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాజధాని నిర్మాణం పేరిట ఇటీవల కాలంలో పంట భూముల విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు ఉపాధి కోల్పోయారని, భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన విమర్శించారు. ఇవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని, భూముల సేకరణలో అత్యుత్సాహం చూపిన మంత్రులు ఇప్పుడు రైతులకు ముఖాలు చాటేస్తున్నారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం మీ సొంత వ్యవహారం కాదని, ప్రజలకు సంబంధించిందని, పైగా భూములిచ్చిన రైతుల భవిష్యత్తు కూడా ఆధారపడి వుందని అన్నారు. కాబట్టి విపక్షాలు ఆ ఫైళ్లను పరిశీలించేందుకు వీలుగా కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ టేబుల్‌పై పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.