తెలంగాణ

ఎటిఎంలే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్/సంగారెడ్డి, డిసెంబర్ 16: దొంగల ముఠాలు ఏకంగా ఏటిఎంలపైనే కనే్నశాయ. వరుస సంఘటనలతో పోలీసులకే సవాల్ విసురుతున్నాయ. మంగళవారం తెల్లవారుజామున కోటగిరి, వర్ని మండలాల్లోని నాలుగు ఎటిఎం సెంటర్లలో దొంగలు చొరబడి సుమారు 43లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయన 24 గంటల్లోపే మరోసారి తెగబడ్డారు. ఈసారి మెదక్ ఏటి ఎంలపై కనే్నసిన దొంగలు మూడు చోట్ల చోరీకి పాల్పడ్డారు. నిజామా బాద్ జిల్లాలో తారసపడిన దోపిడీ దొంగల ముఠాపై లింగంపేట ఎస్‌ఐ రాకేష్‌గౌడ్ కాల్పులు జరిపినా ఫలితం లేకపోయంది. పోలీసుల కన్నుగప్పి తాడ్వాయ అడవుల్లో కనుమరు గయ్యారు. మంగళవారం అర్ధరాత్రి మెదక్‌లోని ఆటోనగర్ ఎస్‌బిఐ ఎటిఎంలో చొరబడి గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేస్తుండగా మంటలు చెలరేగి చోరీ యత్నం ఫలించలేదు. ఇంతలో పెట్రోలింగ్ పోలీసులు రావడంతో దోపిడీ దొంగలు బొలేరో వాహనంలో నిజామాబాద్ జిల్లా వైపు పరారయ్యారు. అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేయడంతో నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలోని మెంగారం శివారులో బొలెరో వాహనంలో వస్తూ తారసపడ్డ దొంగలపై లింగంపేట ఎస్‌ఐ పల్లె రాకేష్‌గౌడ్ ఒక రౌండ్ కాల్పులు జరిపినా ఫలితం లేకపోయంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో ఎటిఎం దొంగల కోసం వేటను ముమ్మరం చేశారు. అన్ని మండలాల పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ గాలింపులు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ రేంజ్ ఐ.జి నవీన్‌చంద్ సైతం జిల్లాకు చేరుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ గాలింపులు చేపడుతున్న క్రమంలోనే గాంధారి మండల పోలీసులు బొలెరో వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం మహారాష్ట్ర పాసింగ్ నెంబర్ కలిగి ఉండడం, వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారే ఎటిఎం సెంటర్లలో చోరీకి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు బలంగా విశ్వసిస్తూ తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఐజి నవీన్‌చంద్ ధ్రువీకరించారు. సాధ్యమైనంత త్వరగా ఎటిఎం చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని ఐజి పేర్కొన్నారు. ముగ్గురు అనుమానితులు తమ అదుపులోనే ఉన్నారని, ఏటిఎం చోరీలతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. దొంగలు ముసుగులు ధరించి, గ్యాస్ కట్టర్ల సహాయంతో ఎటిఎంల చోరీలకు పాల్పడుతున్నారని, నిందితులను గుర్తించేందుకు సి.సి టివిల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. మరోపక్క తాడ్వాయి అడవుల్లోకి వెళ్లిన దొంగల కోసం నిజమాబాద్ జిల్లా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
మెదక్‌లో 3లక్షల నగదు దగ్ధం
మెదక్‌లో మంగళవారం అర్ధరాత్రి ఒకేసారి మూడు ఏటిఎంలపై దోపిడీ దొంగలు విరుచుపడ్డారు. గ్యాస్ కట్టర్లతో మెషీన్‌ను తొలగించే క్రమం లో మంటలు చెలరేగి మెదక్ ఎస్‌బిఐ ఎటిఎంలో సుమారు 3 లక్షల రూపాయలకుపైగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయతే పోలీసులుకానీ, బ్యాంకు అధికారులు కానీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. అలాగే, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇండి క్యాష్ ఎటిఎంను గుర్తు తెలియని దొంగల ము ఠా ధ్వంసం చేసింది. ఈ ఎటిఎం నుం చి 3.21 లక్షల రూపాయలు అపహరించుకుపోయారని డిఎస్పీ తిరుపత న్న వెల్లడించారు. కౌడిపల్లిలోని ఎస్‌బిఐ ఎటిఎంను లూటీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేసారు. చోరీకి ప్రయత్నించిన సమయంలో ఎటిఎంలో సుమా రు 8 లక్షల రూపాయలు ఉన్నా యి. డబ్బు భద్రంగా ఉందని తెలుసుకు న్న బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్ర ముఠాల పనే: ఐజి
మెదక్ టౌన్: మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఎటిఎంలలో చోరీలకు పాల్పడింది మహారాష్ట్ర ముఠాలేనని నిర్ధార ణకు వచ్చినట్లు ఐజి నవీన్‌చంద్ పేర్కొన్నారు.
చోరీలకు కారణాలపై ఆ రా చేసేందుకు వచ్చిన ఐజి విలేఖ రులతో మాట్లాడుతూ మహారాష్ట్ర ము ఠా ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారిం చామన్నారు. పోలీసులు అలర్ట్‌గా ఉండి వెంబడించినప్పటికీ వారు దొరకలేదన్నారు. వారిని త్వరలోనే వారిని పట్టుకొని తీరుతామన్నారు.

సంగారెడ్డి పాత బస్టాండ్ ఆవరణలో దోపిడీ దొంగలు లూటీ చేసి ధ్వంసం చేసిన ఇండి క్యాష్ ఎటిఎం
మెదక్ ఆటోనగర్‌లో దొంగల బీభత్సంలో దగ్ధమైన ఎస్‌బిఐ ఎటిఎంను సందర్శించిన ఎస్పీ సుమతి
ఎటిఎంను పరిశీలిస్తున్న ఐజీ నవీన్‌చాంద్

ఖేడ్‌లో పాగాకు తెరాస ఎత్తులు
ఏకగ్రీవం కోసం ముమ్మర యత్నాలు

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, డిసెంబర్ 16: కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అధికార టిఆర్‌ఎస్ వ్యూహరచనలు చే స్తోంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న దృష్ట్యా ముందుగానే అన్ని చక్కబెట్టే కార్యక్రమంలో నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పలువురు మంత్రు లు సుడిగాలి పర్యటనలు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. మారుమూల గ్రామాలకు సరైన రోడ్లు లేకపోగా, తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్న గ్రామాలకు నీటి వసతులు కల్పించడంపై దృష్టి సారించారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్ ఖేడ్ నియోజకవర్గంలో మాకాం పెట్టారు. వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, జడ్పీటిసి సభ్యులతో ఏకాంత చర్చలు జరుపుతూ గులాబి గూటికి తరలివచ్చేలా చాపకింద నీరులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అవసరమైతే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. దివంగత కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిని కట్టబెట్టి పోటీ నుంచి విరమింపజేసేందుకు చర్చలు జరుపుతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చినప్పటికీ ఇది ఎంతవరకు సాధ్యపడుతుందన్నది ప్రశ్నార్థకమే. టిడిపి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. విజయపాల్‌రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని దేశం నేతలతో చర్చలు జరిపి బరిలోకి దిగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మూడు పార్టీలు పోటీలో ఉంటాయని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నా ప్రధాన పోటీ టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మద్య ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్ వెలువడితే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో తిష్టవేసి ఓటరు ఓటరు మద్దతు కూడగట్టేందుకు పార్టీ పరంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
మంత్రి హరీష్‌రావు పలుమార్లు పర్యటించి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటగా తీర్చిదిద్దుతానని తనపై విశ్వాసం ఉంచి తమ పార్టీని ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని అభివృద్ధి చేసుకోవాలనే కొత్త ఆలోచన నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆలవాలంగా ఉన్న ఖేడ్ నియోజకవర్గ ఓటర్లలో మార్పు వస్తే టిఆర్‌ఎస్ వేసే ఎత్తులన్నీ ఫలిస్తాయని, ఎప్పటి మాదిరిగానే తమ వర్గాలకు అనుకూలంగా ఉంటే గెలుపు, ఓటములను పరిశీలకులు సైతం అంచనా వేయరని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో ఉన్న రెండు గ్రూపులు ఏకమైతే టిఆర్‌ఎస్ గెలుపు కష్టతరంగా ఉంటుందని, టిడిపి అభ్యర్థి లేకపోతే జరిగే ముఖాముఖి పోటీలో టిఆర్‌ఎస్‌కు అవకాశాలు ఉంటాయన్న చర్చ కొనసాగుతోంది. మొత్తంమీద కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు చేసి గులాబీ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.