తెలంగాణ

చొప్పదండి ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, ఏప్రిల్ 11: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటిలో దోపిడీ దొంగలు చొరబడి వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొడిగె శోభ గంగాధర చౌరస్తాలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఉగాది పండుగకు ముందు ఇల్లుకు తాళం వేసి కరీంనగర్ వెళ్లి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా మల్యాల మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కరీంనగర్ ఇంటికి వెళ్లే క్రమంలో గంగాధర చౌరస్తాలో ఉన్న ఇంటిలో టీ తాగేందుకు ఆగి ఇంట్లోకి వెళ్లగా ఇంటి ముందు తాళం పగులగొట్టి బేడెం విరిగిపోయి ఉండటాన్ని చూసి, అలాగే పక్క దర్వాజకు వెళ్లగా ధర్వాజ తెరిచే ఉండడాన్ని గమనించారు. తాము తాళం వేసిన ఇల్లు తలుపు ఎవరు తీశారని ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి అందులోని 50 వేల నగదుతో పాటు తులమున్నర బంగారు ఆభరణాలు, మరికొంత వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఎమ్మెల్యే శోభ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, చొప్పదండి సిఐ లక్ష్మిబాబు, ఎస్‌ఐ నీలం రవి ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్‌తో పాటు క్లూస్ టీమ్స్‌ను రప్పించి వేలిముద్రలను సేకరించారు. ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త గాలన్న తమ ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారు ఆభరణాలతో పాటు వివిధ వస్తువులను చిందరవందర చేయడాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు టిఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పరామర్శించారు.