తెలంగాణ

పాన్‌గల్‌లో రాకెట్ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, డిసెంబర్ 16: మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని కొత్తపేట, గూడెం, పాన్‌గల్ గ్రామాల సమీపంలో రాకెట్ పడిందన్న వదంతులు బుధవారం సాయంత్రం వ్యాపించడంతో మండల ప్రజలు భయాందోళన చెందారు. రాకెట్ మంటలు, పొగలు విరజిమ్మడంతో పొలాల సమీపంలో పడిందని గ్రామాల ప్రజలు పంట పొలాలకు చేరుకొని పరిశీలించారు. ఎస్.ఐ శ్రీనివాస్, పోలీసులు గ్రామాల పరిసరాలలో పరిశీలించారు. రెవెన్యూ, పోలీసుల సమాచారం మేరకు రాకెట్ మండలంలో పడలేదని, కేవలం వదంతులు మాత్రమేనని చెప్పారు.

ఎసిబి వలలో
తోటపల్లి గ్రామ కార్యదర్శి
బెజ్జంకి, డిసెంబర్ 16: కరీంనగర్ జిల్లా, బెజ్జంకి మండలం, తోటపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నర్సయ్యను బుధవారం ఎసిబి డిఎస్పీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి తోటపల్లి గ్రామంలో గోవిందరావు అనే వ్యక్తి వద్ద తుపాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి భూమిని లీజుకు తీసుకున్నాడు. ఇటుక బట్టీలు కాల్చడానికి తుపాకుల శ్రీనివాస్ ఎన్‌ఓసి సర్ట్ఫికేట్ కోసం గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆశ్రయించాడు. అందుకు కార్యదర్శి పది వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఆరు వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతటితో శ్రీనివాస్ ఎసిబి అధికారులను ఆశ్రయించగా బుధవారం దేవక్కపల్లి గ్రామంలో రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.