తెలంగాణ

పులి సంచారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేక్మాల్, డిసెంబర్ 16: అరణ్యంలో ఉండాల్సిన చిరుత పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి... భయాందోళనతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు... మొన్న తుక్కాపూర్... నిన్న కోనాపూర్... నేడు కోరంపల్లి...మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కోరంపల్లి గ్రామం మంజీరా పరివాహక ప్రాంతంకు చేరువలో ఉంది.
ఈ గ్రామానికి చెందిన బాగారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన పత్తిని తీయడానికి బుధవారం కూలీలను పంపించాడు. వారు పత్తి తీస్తున్న క్రమంలో చాకలి సత్యమ్మకు నిద్రిస్తున్న చిరుతపులి కనిపించింది. ఒక్కసారిగా ఆమె గొంతుతడి ఆరిపోయి నోట నుంచి మాట రాలేదు. కేకలు వేస్తు తన పక్కన ఉన్న కళ్లు యాదమ్మకు విషయం తెలపడంతో ఆమె సైతం బిత్తరపోయింది.
వీరిద్దరి అలికిడితో చిరుతపులి కాస్త అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరి అరుపులను గమనించిన తోటి కూలీలు విషయం తెలుసుకుని పరుగు పరుగున గ్రామానికి చేరుకున్నారు.
ఈ విషయం దావాలంలా గ్రామం లో పాకిపోయింది. స్థానిక సర్పంచి కల్లు సత్యమ్మ అధికారులకు విష యం తెలపడంతో అక్కడికి మండల తహశీల్దార్ తులసీరాం, ఎస్సై శేఖర్‌రెడ్డి చేరుకున్నారు. వీరు అటవీశాఖ అధికారులతో సమాచారం అందించడంతో రేంజ్ అధికారి శ్యాంకుమార్, బీట్ ఆఫీసర్ అశ్వక్ కోరంపల్లికి చేరుకుని వివరాలను సేకరించారు. చిరుతపులి సంచరించిన ప్రాంతంలో దాని కాలి అడుగులను గుర్తించి వివరాలను నమోదు చేసుకున్నారు.
గత రెండు రోజుల క్రితం కొల్చారం మండల కొనాపూర్ గ్రామ శివారులో చిరుతపులి సంచరించినట్లుగా సమాచారం ఉందని, ఇక్కడ సంచరించిన చిరుత అడుగులతో పోల్చి చూసి ఒకటే చిరుతనా? లేక రెండు ఉన్నాయా? అనే విషయాన్ని నిర్ధారించాల్సివుందని రేంజ్ ఆఫీసర్ శ్యాంకుమార్ తెలిపారు. చిరుతను పట్టుకునేందుకుగాను సంచరించిన ప్రాంతంలో బోనును ఏర్పాటు చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
కోరంపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని టేక్మాల్ తహశీల్దార్ తులసీరాం, ఎస్సై శేఖర్‌రెడ్డి లు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే ప్రజలు సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వచ్చే వదంతులను నమ్మకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. మంజీరా పరివాహక ప్రాంతాలైన కోరంపల్లి గ్రామంతోపాటు ధనూర, ఎలకుర్తి గ్రామాలకు చెందిన ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
భయం గుప్పిట్లో కోరంపల్లి
చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలిసినప్పటి నుంచి కోరంపల్లి గ్రామ ప్రజల వెన్నులో వణుకు పుట్టింది. పులి సంచరించిన స్థలానికి గ్రామం అతిదగ్గరగా ఉండటంతో ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. సంచరించిన స్థలానికి స్థానికులతోపాటు టేక్మాల్ మండల పరిధిలోని ధనూర, ఎలకుర్తి, శేరిపల్లి, పల్వంచ, టేక్మాల్ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పులి సంచరించిన ప్రాంతంలో గుంపులు, గుంపులుగా తిరిగారు.