తెలంగాణ

నిఖిల్‌కు చేసిన ఆపరేషన్ అరుదైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఎత్తును పెంచేందుకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు నిఖిల్‌రెడ్డికి నిర్వహించిన ఆపరేషన్ అరుదైన ఆపరేషన్ అని అనైతికమైనది కాదని తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైద్యులు గురువారెడ్డి, చంద్రబోస్, ప్రసాద్ మాట్లాడుతూ శస్తచ్రికిత్స విషయంలో వివిధ మీడియా సంస్థల్లో వస్తున్న వార్త కథనాలను ఆవేదన కలిగించాయని అన్నారు. నిబంధనల ప్రకారం మేజర్ అయిన వ్యక్తి తన ఇష్టపూర్తిగా ఆపరేషన్‌కు సిద్ధపడితే శస్తచ్రికిత్స నిర్వహించవచ్చునని చెప్పారు. ఎత్తు పెంచే శస్తచ్రికిత్సలు దేశంలో సుమారు 30 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి తొమ్మిది నెలలు బెడ్‌పైనే ఉండాల్సి వస్తుందనడం సరికాదని, నాలుగో రోజు నుంచి శస్తచ్రికిత్స చేయించుకున్నవారు స్టాండ్ సహాయంతో తమ వ్యక్తిగత పనులు చేసుకోవచ్చునని చెప్పారు. అదే సమయంలో ఇది డాక్టర్లకు ఓ గుణపాఠం లాంటిదని, భవిష్యత్తులో నిర్వహించే ఆపరేషన్లకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని హెచ్చరిక వంటిదన్నారు.