తెలంగాణ

నేడు చలో హెచ్‌సియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిస్థితులను చక్కదిద్దాలని, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావును తొలగించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని, విద్యార్ధులపై బనాయించిన కేసులను తొలగించాలని కోరుతూ విద్యార్ధుల ఐక్య కార్యాచరణ కమిటీ బుధవారం నాడు చలో హెచ్‌సియు నిర్వహిస్తోంది. ఛలో హెచ్‌సియు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్రంలోని అన్ని విద్యార్ధి సంఘాలను కోరినట్టు జాక్ నేతలతో పాటు సామాజిక విశే్లషకుడు సజయ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, బి సాంబశివ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పేర్కొన్నారు. గత నెల 22వ తేదీన విసి అప్పారావు మళ్లీ వర్శిటీకి వచ్చి పదవిలో కొనసాగడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై ఖర్కశంగా పోలీసులతో లాఠీఛార్జి చేయించి 47 మంది విద్యార్ధులపై కేసులు పెట్టి జైలుకు పంపించారని, నిరంకుశంగా వ్యవహరిస్తున్న విసి అప్పారావు తన పదవిని స్థిరపరచుకోవడం కోసం బుధవారం నాడు అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని చూస్తున్నారని వారు చెప్పారు. ఒక దళిత విద్యార్ధి కారణమైన విసి ఇలాంటి కుటిల ప్రయత్నాలు మానుకోవాలని, అకడమిక్ కౌన్సిల్‌ను వెంటనే రద్దు చేయాలని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, జాక్ నేతలు డేవిడ్, టిఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మూడ్ శోభన్, ఎఐడిఎస్‌ఓ రాష్టక్రార్యదర్శి చంద్రశేఖర్‌లు పేర్కొన్నారు.వర్శిటీల్లో అధికారులు ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని వారు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం హెచ్‌సియు వివాదాన్ని పట్టించుకోకపోవడం కూడా దారుణమని అన్నారు. కాగా, మానవహక్కుల సంఘానికి మంగళవారం నగర పోలీసులు నివేదిక అందజేశారు.
చంద్రబాబు సహా
‘పనామా’లో ప్రముఖులు
సిపిఐ, వైకాపా నేతల విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 5: విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల జాబితాలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు ఉండటం సిగ్గు చేటని వైకాపా, సిపిఐ నేతలు అన్నారు. ఈ జాబితాలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తే చంద్రబాబు పేరు బయటకు వస్తుందని, ఏపి రాజధాని నిర్మాణ పనులను విదేశాల చేతుల్లో ఎందుకు పెట్టారో వెల్లడవుతుందని ఆమె తెలిపారు. చిన్న ద్వీపమైన పనామాలో మన దేశానికి చెందిన 500 మంది ప్రముఖులు నల్ల ధనాన్ని దాచారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యరాయ్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విస్ బ్యాంకు నుంచి 73 లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని బిజెపి నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.

వినయంగా మాట్లాడాలి
కెటిఆర్‌కు మధుయాష్కీ హితవు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 5: రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు వినయంగా మాట్లాడితే మంచిదని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ హితవు పలికారు. విపక్షాల పట్ల కెటిఆర్ చులకన భావంతో మాట్లాడుతున్నారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఆంధ్రవారితో కెటిఆర్ కుదుర్చుకున్న కాంట్రాక్టులను త్వరలో బయటపెడతామన్నారు. నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుండడంతో ప్రభుత్వం భయపడుతోందని ఆయన తెలిపారు. పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించలేకపోయినందుకు కెటిఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

జగ్జీవన్‌రామ్‌కు
రాజకీయ నేతల నివాళి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 109వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు నిర్వహించాయి. నిజాం కళాశాల ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు, దళిత సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సంబమూర్తి, జి.ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే ఎం.ఇందిర తదితరులు జగ్జీవన్ రామ్‌కు శ్రద్ధాంజలి ఘటించగా, గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఇందిరా భవన్‌లో ఏపి కాంగ్రెస్ నాయకులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూల దండ వేసి నివాళులర్పించారు. అలాగే ‘బస్ భవన్’లో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి టిఎస్‌ఆర్‌టిసి జెఎండి జివి.రమణారావు పూల దండ వేసి నివాళి అర్పించారు.

రాత్రి కరెంట్‌కు రైతు బలి
కౌడిపల్లి, ఏప్రిల్ 5. రాత్రిపూట కరెంట్ రైతును బలిగొన్న సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య(45) సోదరులకు గ్రామశివారులో పొత్తులో బోరుబావి ఉంది. బోరుబావి నీటితో వారు వరిపొలం సాగుచేస్తున్నారు. వంతుల వారిగా వరిపొలానికి నీరు పారించుకుంటున్నారు. సోమవారం రాత్రి కిష్టయ్య వంతు వచ్చింది. వరి పొలంకు నీరు పెట్టేందుకు కిష్టయ్య పొలం వద్దకు వెళ్ళాడు. రాత్రిపూట కరెంట్ వచ్చింది. బోరుబావి మోటర్ నడవకపోవడంతో స్టాటర్ డబ్బా వద్దకు వెళ్లాడు. స్టాటర్ డబ్బాలోని ఫ్యూజ్ వైరు తెగి డబ్బాకు కరెంట్ సరఫరా జరిగింది. ఇది గమనించని కిష్టయ్య స్టాటర్ డబ్బాను తెరిచి రిపేర్ చేసి బోరుమోటర్‌ను నడిపిస్తానని అనుకున్నాడు. స్టాటర్ డబ్బాకు కరెంట్ సరఫరా జరగడంతో కరెంట్‌షాకుతో కిష్టయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తెల్లవారిన కిష్టయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి కిష్టయ్య బోరుబావి వద్ద మృతి చెంది ఉన్నాడు. స్థానిక పోలీసులకు సమాచారం తెలవడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కిష్టయ్య మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు కిష్టయ్యకు భార్య వీరమణి, ఇరువురు కుమార్తెలు సంతోష (21), మధు (16), కుమారుడు పవన్ (10)లు ఉన్నారు. సంతోషకు పెల్లి జరిగింది. మధు పదవతరగతి చదువుతున్నది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ తెలిపారు.