తెలంగాణ

దారిమళ్లిన సహాయ నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణలో సిఎం సహాయ నిధి దారిమళ్లింది. వివిధ ఆసుపత్రులకు చెందిన నకిలీ బిల్లులతో 73 లక్షలు స్వాహా అయ్యాయి. 11,600 దరఖాస్తులను క్రైమ్ ఇనె్వస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అధికారులు పరిశీలించారు. వీటిలో 112 మంది పేర్లతో నకిలీ బిల్లులు పెట్టి రూ. 73,68,572 లక్షలు కాజేసినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న పదిమందిలో ఐదుగురు బ్రోకర్లను సిఐడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో కరీంనగర్‌కు చెందిన వెనె్నంపల్లి రాజేందర్, సింగిరెడ్డి సుభాష్‌రెడ్డి, అడిగొప్పుల సాగర్, బొగ్గురం మురళీ ప్రసాద్, తాటు శ్రీనివాస్ ఉన్నారు. ఈ వ్యవహారంలో 20 మంది బ్రోకర్ల ప్రమేయం ఉన్నట్టు సిఐడి అధికారులు గుర్తించారు. గతంలో పది మందిని అరెస్టు చేయగా తాజాగా మరో ఐదుగురిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు. వీరంతా కలసి సుమారు 50 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డులతో నకిలీ బిల్లులు పెట్టి నిధులు కాజేశారు. సీఎం సహాయ నిధిలో గోల్‌మాల్ జరిగిందని, ఆరోగ్యశ్రీ పథకం పక్కదారి పడుతుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశం మేరకు విచారణ చేపట్టామని సిఐడి అధికారులు తెలిపారు. సీఎం సహాయ నిధి కుంభకోణంలో ఇంకా విచారణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.