తెలంగాణ

వారంలో తుది ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ మహారాష్టల్ర మధ్య మరో వారంలో తుది ఒప్పదం జరగనుంది. హైదారాబాద్‌లో జరిగే ఒప్పందం కోసం మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. నిర్దేశించిన కాలంలో ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాలకు సాగునీటిని అందించే కలను నిజం చేయనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం సచివావయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కె జోషి పాల్గొన్నారు. ప్రాణహిత -చెవెళ్ల పథకానికి ప్రత్యామ్నాయంగా చేపడుతున్న తమ్మిడి హట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులకు చెందిన ప్యాకేజీలపై చర్చించారు. ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావడానికి ఆర్థిక శాఖ నుంచి పూర్తి సహకారం అవసరమని కోరారు. నిధుల విడుదలలో జాప్యం జరగకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి న్యాయపరంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఈనెల తొమ్మిదవ తేదీన మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అవసరం ఎందుకు వచ్చింది? రీ డిజైనింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఆ శాఖ అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రీ డిజైనింగ్‌పై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం మంగళవారం సమావేశం అయింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇంతకుముందు రెండుసార్లు సమావేశమై ప్రాథమిక అంశాలపై చర్చించారు. మంగళవారం మరోసారి సమావేశం జరిగింది. మంగళవారం నాటి సమావేశానికి ఆర్థిక మంత్రి మినహా మిగిలిన వారు హాజరయ్యారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తొలి సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై చర్చించారు. అంతర్ రాష్ట్ర సమస్యలు, వన్యప్రాణి సంరక్షణ, అటవీ అనుమతులు, పర్యావరణ తదితర సమస్యల పరిష్కారం కోసమే రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్, ప్రాణహిత చెవెళ్ల పథకాలకు ప్రత్యామ్నాయ పథకాలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ప్రాణహిత- చెవెళ్ల పథకాన్ని రెండు భాగాలుగా విభజించిన ప్రభుత్వం తమ్మిడి హెట్టి వద్ద ఒక ప్రాజెక్టు, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద మరో ప్రాజెక్టు చేపట్టబోతోంది. ఈ ప్రాజెక్టు రీ డిజైనింగ్ వల్ల దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు లభించనుంది. ప్రాణహిత- చేవెళ్ల పథకానికి మహారాష్ట్ర అభ్యంతరాలు, కేంద్ర జల సూచించిన నీటి లభ్యత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని రీ డిజైన్ చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ దగ్గర భారీ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. దీనివల్ల నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఖమ్మం జిల్లాలో గత పాలకులు ప్రతిపాదించిన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా ఆ జిల్లాలో ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్పృష్టించేందుకు నిర్ణయం తీసుకున్న అంశాన్ని వివరించారు.