తెలంగాణ

ముగిసిన సిద్దిపేట మున్సి‘పోల్’ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 4: కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గానికి నోచుకుండా ప్రత్యేక అధికారి పాలనలో మగ్గిన సిద్దిపేట పురపాలక సంఘానికి మరో వారం రోజుల్లో కొత్త పాలకవర్గం ఏర్పాటు కానుంది. ఈ నెల 6వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 34 వార్డులకుగాను 6 వార్డులు ఏకగ్రీవం కాగా 28 వార్డులకు ఎన్నికలు నిర్వహణ కొనసాగనుంది. 28 వార్డుల్లో 74,710 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 146 మంది అభ్యర్థులు బరిలో ఉండగా టిఆర్‌ఎస్ పార్టీ 28, కాంగ్రెస్ 15, బిజెపి 14, టిడిపి 12, సిపిఎం ఇద్దరు, స్వతంత్రులు 70 మంది, ఎంఐఎం అభ్యర్థులు తమ భవిషత్తును పరీక్షించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు మొత్తం 72 కేంద్రాలను ఏర్పాటు చేసారు.
415 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 72 వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. 36 మంది సూక్ష్మ పరిశీలకులు, 18 మంది వీడియోగ్రాఫర్లు, 8 మంది జోనల్ ఆఫీసర్లు, 18 వాహనాలు, 72 మంది బూత్‌స్థాయి అధికారులు, 480 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసారు. పోలీసు బందోబస్తును ఎస్పీ సుమతి స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఓటర్లకు ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తాగునీరు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, షామియానాలు, మూత్రశాలలు, ఓఎస్‌ఆర్ ప్యాకెట్లు, ఎఎన్‌ఎంల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఎండ తీత్రవ దృష్ట్యా ఓటర్లు ఉదయం, సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే అవాకశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎంలను ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించి భద్రపర్చనున్నారు. 11వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత పట్టణం, మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో క్లీన్‌స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఇప్పటి వరకు పట్టణాభివృద్ధిలో సాధించిన విజయాలను ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు కూడా ఏ మాత్రం తీసిపోకుండా టిఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను, టిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యక్తిత్వాలను వివరించి లబ్దిపొందే ప్రయత్నం చేసారు. ఓటర్లు మాత్రం ఎవరిని కాదనకుండా తలలు ఊపి ఆశల పల్లకిలో ఊరేగించారు. బుధవారం నాడు ఓటర్లు ఇచ్చే తీర్పు ఏమిటో 11వ తేదీన బయటపడనుంది. పది రోజులుగా కొనసాగిన ప్రచార పర్వం ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.