తెలంగాణ

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో పలు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అధికం గా ఫీజులు వసూలు చేస్తున్న ట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవా రం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసేల్, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ సోమవా రం విచారణ చేపట్టింది. ప్రభు త్వం తరఫున హాజరైన ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ కోర్టుకు వివరణ ఇస్తూ ఫిర్యాదుల ఆధారంగా ప్రభు త్వం నగరంలోని 12 ప్రైవేట్ స్కూళ్ల కు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ స్కూళ్ల యాజమాన్యాలు తిరిగి సమాధానం కూ డా పంపించాయని, వాటిని ప్రస్తుతంసమీక్షిస్తున్నామన్నారు.