తెలంగాణ

పెళ్లింట్లో చావు బాజా ఉరేసుకొని వరుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, ఏప్రిల్ 3: కాళ్ల పారాణి ఆరకుండానే నవ వధువు పసుపు కుంకుమలు కోల్పోయన విషాద ఉదంతమిది. పెళ్లయన కొద్ది గంటల కే ఇష్టం లేదంటూ సదరు పెళ్లికొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఉదంతం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌టి మండలం డబ్బా గ్రామ పరిధిలోని ధరంపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబీకులు, పోలీసులు వివరాల ప్రకారం.. ధరంపల్లి గ్రామానికి చెందిన కావిడె మల్లయ్య, బక్కు బాయి దంపతుల కుమారుడు కావిడె సదాశివ్ (25)కు కౌటాల మండలం కనె్నపల్లి గ్రామానికి చెందిన గుర్లె పోశయ్య, అమ్మక్కల కుమార్తె లక్ష్మి (అమృత) (20)తో శనివారం మధ్యాహ్నం వరుడి ఇంట పెళ్లి కార్యక్రమం సంప్రదాయ రీతిలో జరిగింది. ఈక్రమంలోనే పెళ్లి విందు భోజనాలు, ఆపై పెళ్లి తతంగాలను పూర్తిచేసుకున్న అనంతరం సాయం త్రం సమయంలో పెళ్లికూ తురి ఇంటికి బయలుదేరేందుకు బరాత్ (సాగనంపు వేడుకలు) ప్రారంభమైంది. ఇరువైపు ల వారు జోష్‌తో నృత్యాలు చేస్తున్న క్రమంలోనే నవ వరుడు సదాశివ్ ఆకస్మికంగా తనకు బహిర్భూమికని వెళ్లి.. గంటసేపైనా తిరిగిరాలేదు. ఆందోళన తో బంధువులు, కుటుంబీకులు ఆరా తీయగా, గ్రామ సమీపంలోని వాగు వద్ద చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఈ ఘటనతో ఇక్కసారిగా హతాశులైన కుటుంబీకులు, బంధువులు ఏం చేయాలో పాలుపోక తలలు బాదుకొని రోదనలో మునిగిపోయారు. సదాశివ్ మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ లభించిం ది. తమకు పరిచయస్తులైన ఇద్దరు ఈ పెళ్లిని కుదిర్చారని, ఈ పెళ్లి ఇష్టం లేదని, అందువల్ల నేను అమ్మాయిని బాధపెట్టకూడదని సంతోషంగా ఆమె ను ఉంచాలనే ఉద్దేశంతోనే మీకు దూరంగా పోతున్నానని లేఖలో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన
నవ వరుడు సదాశివ్

మీ పవర్ పాయింట్‌కు మేమొస్తాం

కాంగ్రెస్‌కు స్పష్టం చేసిన కవిత
సిఎంపై భట్టి విమర్శలు అర్ధరహితమని విమర్శ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3: నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయాలని తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని, వాళ్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు ఆహ్వానిస్తే నీటిపారుదల రంగం నిపుణుడితో కలిసి వెళ్లడానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని టిఆర్‌ఎస్ ఎంపి కవిత తెలిపారు. కాంగ్రెస్ నాయకులు సభలో ఉండి, మాట్లాడితే బాగుండేదని అన్నారు. సభలో ఉండకుండా బయట ఏమేమో మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ బాగుందని, విజన్ ఉన్న నాయకుడని దేశమంతా అంటుంటే భట్టి అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నా రు. 60 ఏళ్ల అన్యాయంపై కెసిఆర్ ఎండగడతారనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారని అన్నారు. భట్టి విక్రమార్క మాటల్లో నిజం ఉంటే రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో స్టడీ చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని అన్నారు.
పుర్రె గుర్తు సైజు
తగ్గించండి: కవిత
బీడి కట్టలపై పుర్రె గుర్తు సైజును తగ్గించాలని కోరుతూ ఎంపి కవిత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రం అందజేశారు. ఈ అం శంపై ఏర్పాటు చేసిన సబార్డినెట్ లెజిస్లేషన్ కమిటీ నివేదక యధాతథంగా అమోదిస్తే, బీడి కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నా రు. లక్షలాది మంది ఉపాధితో ముడిపడి ఉన్న ఈఅంశంపై ప్రధానమంత్రితో మాట్లాడతానని బండారు దత్తాత్రేయ కవితకు హామీ ఇచ్చారు.