తెలంగాణ

ఇక సూపర్ స్పెషాలిటీలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా కేంద్ర ఆస్పత్రులకు మహర్దశ ఎంఆర్‌ఐ, సిటి స్కానింగ్, ఐసియుల ఏర్పాటు
రోగులకు అధునాతన సౌకర్యాలు తుక్కు కింద పాత సామాన్ల అమ్మకం
సూపరింటెండెంట్లకు సర్వాధికారాలు హెచ్‌ఓడిల వద్ద ప్రత్యేక నిధి

సర్కారీ వైద్యం అంటే బెదిరిపోవాల్సిన రోజులు పోతున్నాయ. నగరాల్లో నెలకొన్న సూపర్ స్పెషాలిటీల తరహాలో జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు సర్కారు కంకణం కట్టుకుంది. తగిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి సర్కారీ వైద్యంపై సామాన్యుడికి భరోసా కల్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ పట్టనుంది. వచ్చే మూడు నెలల్లో వీటి రూపు రేఖలను సమూలంగా మార్చడానికి ప్రణాళిక సిద్ధమైంది. జూలైనాటికి మార్పులు కార్యరూపం దాల్చనున్నాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులలో సూపర్ స్పెషాలిటీలలో అందించే వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో మాత్రమే లభిస్తున్న ఎంఆర్‌ఐ, సిటి స్కానింగ్, ఐసియు యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో హైదరాబాద్ వినా తొమ్మిది జిల్లాల్లోని 13 జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారబోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. జిల్లాకు నాలుగు డయాలసిస్ కేంద్రాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి), ఏరియా ఆస్పత్రులను ప్రైవేట్ హాస్పిటల్స్ మాదిరిగా ముస్తాబు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వీటితో పిహెచ్‌సి భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు భవనాలకు రంగులు వేయాలని నిర్ణయించింది. దీనికిగాను ప్రత్యేకంగా రూ. 521 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో పారిశుద్ధ్యం లోపించడాన్ని ప్రభుత్వం గుర్తించింది. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం, టాయిలెట్స్, మంచినీళ్లు, ఫ్లోరింగ్, ప్లంబింగ్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 171 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో మంచాలు, ఐవి స్టాండ్లు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు తుప్పుపట్టిపోవడం, పరుపులు చెడిపోవడం, బెడ్‌షీట్లు, పరదాలు చిరిగిపోవడం జరిగింది. వీటిని తుక్కు కింద అమ్మివేసి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి రూ. 600 కోట్లు కేటాయించింది. ఎక్స్‌రేలు, రక్తపరీక్షలు, స్కానింగ్ వంటి పరీక్షలు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో లేవు. వీటిని రోగులు బయట ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో చేయించుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముందు అలా జరగకుండా అన్ని రకాల వ్యాధి నిర్ధారక పరీక్షల కోసం రాష్ట్రంలో 40 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ప్రారంభించబోయే డయాలసిస్, డయాగ్నస్టిక్ కేంద్రాలను జూలై మాసానికల్లా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ. 316 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరత తీవ్రంగా నెలకొంది. రోగులకు ఇవ్వడానికి ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు అంతంత మాత్రంగా ఉన్నాయి. చౌకగా లభించే జ్వరం, నొప్పి మాత్రలు తప్ప ఇతర మందులు ఆస్పత్రులలో అందుబాటులో లేవు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు వైద్యులు రాసి ఇచ్చే మందులను బయటి మెడికల్ షాపులలోనే కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇకముందు ఖరీదైన మందులతో పాటు వైద్యులు రాసి ఇచ్చే మందులన్నింటిని ఆస్పత్రిలోనే అందుబాటులో ఉంచేందుకు వీటి కోసం రూ. 117 కోట్లు కేటాయించింది. ఆస్పత్రులలో చీపురుకట్ట కొనాలన్నా ఇండెంట్ పెట్టి డబ్బులు మంజూరు చేయించుకుంటే తప్ప కొనుగోలు చేయలేని విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న ఫస్ట్ మెడికల్ ఆఫీసర్లకు, ఆస్పత్రి సూపరింటెండెంట్లకు ప్రాథమిక అవసరాల కోసం కొనుగోలు చేయడానికి ఇక నుంచి ఎవరి అనుమతి అవసరం లేకుండా వారికే అధికారాలు కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఓడిలకు (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్) నేరుగా నిధులు ఖర్చు చేయడం కోసం రూ. 56 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. వైద్యరంగంలో సమూల మార్పుల కోసం చేపట్టిన చర్యల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 5,967 కోట్లు కేటాయించింది. ఇంత అధిక మొత్తంలో వైద్యరంగానికి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.