తెలంగాణ

పాత కక్షలతోనే హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 3: సంచలనం సృష్టించిన వైకాపా నేత ఎం.వరలక్ష్మి హత్యోదంతానికి పాత కక్షలే కారణమని తేలింది. కేసులో వికారాబాద్ పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ టి.స్వామి కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 1న వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి ఎస్సీ బాలుర హాస్టల్ వద్ద తాండూరుకు చెందిన వైకాపా నేత ఎం.వరలక్ష్మి మృతదేహం లభించింది. లింగంపల్లి ప్రాంతంలోని గంగారానికి చెందిన మృతురాలి సోదరి నిర్మల తన అక్క వరలక్ష్మిని ఉరేసి చంపారని, హత్యకు తాండూర్‌కు చెందిన జనార్ధన్‌రెడ్డి, అతని భార్య విజయలక్ష్మి, వైకాపా నాయకుడు ప్రభు, విమలక్కలు బాధ్యులంటూ చేసిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంల సాయంతో కేసు దర్యాప్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోన్‌కాల్స్ ఆధారంగా సమాచారం సేకరించి కొంతమందిని అనుమానితులుగా నిర్ధారించారు. అందులో భాగంగా ఉదయం చేవెళ్లలో ఇంటి వద్ద తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ జిల్లా కార్యదర్శి నారాయణ్‌దాస్, షాబాద్ మండలం నారెడ్లగూడకు చెందిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పామెన భీంభరత్, వాహనం డ్రైవర్ ముక్కు రవికుమార్ అలియాస్ శ్యాంలను అరెస్ట్ చేశారు. ముగ్గురినీ విచారించగా పాతకక్షలే హత్యకు కారణమని, డబ్బులు తీసుకుని జనార్దన్‌రెడ్డి, విజయలక్ష్మి ప్రోద్బలంతో హత్య చేసినట్లు వెల్లడించారు. జనార్ధన్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు వరలక్ష్మి మధ్య గత ఐదారేళ్ళుగా భేదాభిప్రాయలున్నాయి. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు కేసులు సైతం పెట్టుకున్నారు. 2011లో ఒక కేసుకు సంబంధించి 2014లో వరలక్ష్మికి మూడు నెలల జైలు, జరిమానా విధించడటమే కాకుండా రౌడీషీట్‌ను కోర్టు ఆదేశం మేరకు తెరిచారు. జనార్ధన్‌రెడ్డి, విజయలక్ష్మి జిల్లా ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నపుడు నారాయణదాస్, భీంభరత్ పరిచయమయ్యారు. అప్పటి పరిచయంతో వరలక్ష్మిని చంపేందుకు మూడు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. మహిళల సమస్యలపై విమలక్కతో మాట్లాడిస్తామని వరలక్ష్మిని పలుమార్లు నారాయణదాస్, భీంభరత్ నమ్మించారు. అందులో భాగంగా మార్చి 31న కలిసేందుకు మాట్లాడుకున్నారు. అదేరోజు ఉదయం వరలక్ష్మి తాండూర్ నుండి బస్సులో ఎంజిబిఎస్ వరకు టికెట్ తీసుకుని ప్రయాణించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తాను కలవాల్సిన వారు కలవకపోవడంతో ఆమె అక్కడి నుండి బస్సు ఎక్కింది. ఇంతలో నారాయణ్‌దాస్ బృందానికి ఫోన్ చేసింది. అప్పటికే ఆమె మొయినాబాద్ టికెట్ తీసుకుంది. మొయినాబాద్‌లో బస్సు దిగగా ఏపి 28 బిజె 2007 ఇన్నోవా కారులో వరలక్ష్మిని ఎక్కించుకున్నారు. వాహనాన్ని వెనక్కి తీసుకెళ్ళి కాళిమందిర్ వద్ద గల సుధ వైన్స్‌లో రెండు బీర్లు తీసుకుని, పక్కనే తినుబండారాలు తీసుకున్నారు. అప్పటికే వాహనం నడిపే రవికుమార్ కల్లులో కలిపే మత్తు మందును సిద్ధంగా ఉంచి బీరుబాటిల్‌లో కలిపి వరలక్ష్మికి ఇచ్చాడు. మొయినాబాద్‌లో ఉండగానే వరలక్ష్మి తన సోదరికి ఫోన్‌చేసి విమలక్క వాహనంలో ఉన్నానని చెప్పింది. చేవెళ్ళ దాటిన తర్వాత వరలక్ష్మి రెండో బీరు బాటిల్ తాగింది. మత్తు ఎక్కింది. మనె్నగూడలో మరోసారి వరలక్ష్మి ఫోన్ మాట్లాడింది. వరలక్ష్మి ఎక్కడికి తీసుకెళుతున్నారని మత్తులోనే అడగ్గా తాండూర్‌లో దింపుతామని చెప్పి, కెరెళ్ళి వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి అనంతగిరిపల్లి వైపు వాహనాన్ని పోనిచ్చారు. అప్పటికే చేవెళ్లలోని హార్డ్‌వేర్ దుకాణంలో కొని ఉంచిన రెండు మీటర్ల నైలాన్‌తాడుతో మత్తులో ఉన్న వరలక్ష్మి గొంతుకు బిగించి చంపారు. అనంతగిరిపల్లి వద్ద ఎవరూ లేని చోటు చూసి తాడుతో మృతదేహాన్ని లాగేశారు. మృతురాలి చెప్పులు రైలు పట్టాలపై, సెల్‌ఫోన్ నాపరాతి లారీపై పడవేశారు. వారి వద్ద నుండి ఇన్నోవా వాహనం, ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ప్రభు, టఫ్ నాయకురాలు విమలక్క హస్తం ఉందా లేదా అనే దానిపై విచారణ చేస్తామని వివరించారు. ముగ్గురినీ కోర్టులో హాజరుపరుస్తామని, పరారీలో ఉన్న నేరస్తులు జనార్ధన్‌రెడ్డి, విజయలక్ష్మిలను తొందరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. దర్యాప్తు కోసం నాలుగు బృందాలను సిఐ స్థాయి అధికారులను నియమించామని వివరించారు. సమావేశంలో సిఐ జి.రవి, ఎస్‌ఐ రవీందర్‌లు పాల్గొన్నారు.
చిత్రం...
హత్యోదంతంలో నిందితులుగా భావించి అరెస్ట్ చేసిన వారితో వికారాబాద్ పోలీసులు