తెలంగాణ

అసెంబ్లీలో హామీల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం హామీల వర్షం కురిపించిందే తప్ప కరవు నివారణపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నథ్ బాబు విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు సాగు నీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ దేశంలో ఇలా చూపించలేదంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని వారు శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. అసెంబ్లీలో కరవుపై జరిగిన చర్చ సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు 12 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే సరైన సమాధానం చెప్పకుండా దాట వేసిందని వారు దుయ్యబట్టారు. సాగునీటి కోసం జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపిస్తే జిల్లాకు కోటి లేదా రెండు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప కరవును అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని వారు విమర్శించారు.