తెలంగాణ

నాగార్జునసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడి, ఎడమకాల్వల ద్వారా నీటివిడుదల కొనసాగుతోంది. ఎడమకాల్వ ద్వారా తాగునీటి విషయమై శుక్రవారం ఉదయం నుండి నీటివిడుదల చేస్తుండగా గత నెల 23వ తేదీ నుండి కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి నీటివిడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 508 అడుగుల నీటిమట్టం ఉండగా కుడికాల్వ ద్వారా 3009 క్యూసెక్కులను, ఎడమకాల్వ ద్వారా 4,599 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతోపాటు ఎస్‌ఎల్‌బిసికి 1200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి సాగర్ జలాశయంకు 6,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు 11టిఎంసిల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కుడికాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీరు రెండురోజుల్లో 4టిఎంసిలు పూర్తిచేసుకోనుంది. ఎడమకాల్వ పరిధిలో శుక్రవారం నుండి నీటివిడుదల ప్రారంభించిన సంగతి తెలిసిందే.