తెలంగాణ

రైతుల పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1: మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలన్న ఆయకట్టు రైతులు పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. 15 రోజులుగా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతాంగం డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆయకట్టుకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుండి వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసేది లేదని జిల్లా అధికారులు తెల్చి చెప్పడంతో తమ ఆందోళనను రోడ్డుపైకి వచ్చి నిర్వహించడమే కాకుండా ఏకంగా ప్రాజెక్టును ముట్టడించి గేట్లు ఎత్తివేసి కాలువలకు నీటిని విడుదల చేసుకున్నారు. దింతో ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడమే కాకుండా ప్రాజెక్టు దగ్గర 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు నిర్వహించారు. అయితే చివరకు రైతులు నిరంతరంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగి వచ్చి శుక్రవారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పూజచేసి రైతాంగానికి సాగునీటిని విడుదల చేశారు. సాగునీరు విడుదల కావడంతో తమ పోరాటం ఫలించిందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి హరీష్‌రావును సైతం రైతులు కలిసి తమ మోరను వినిపించుకున్నారు.
రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని 18 సార్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సంబందిత అధికారులతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లడం అంతేకాకుండా హరీష్‌రావును ప్రత్యేకంగా ఒప్పించడంలో ఎమ్మెల్యే సఫలీకృతమయ్యారు. చివరగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఐదువేల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన కుడి కాలువకు 90 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు గాను ఐదు రోజుల పాటు ప్రతిరోజు 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 11 ఫిట్ల నీటిమట్టం ఉండడం ఇందులో నాలుగు ఫిట్ల నీటిని ఆయకట్టుకు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.