తెలంగాణ

చరిత్ర సృష్టించిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చట్టసభల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. శాసన సభ చరిత్రలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం ప్రారంభం అయింది. శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే తొలుత రుణ విముక్తి బిల్లును సభ ఆమోదించింది. అనంతరం టీ విరామం ప్రకటించి, 11.45 కి సభ ప్రారంభం అయిన తరువాత ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం ప్రారంభించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రసంగించారు. 11.45కు ప్రారంభం అయిన ప్రసంగం, ఎలాంటి విరామం తీసుకోకుండా 2.35వరకు సాగింది. నిలబడి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం రాదని, కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ అనుమతితో కూర్చోని పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. తిరిగి ఉపన్యసించే సమయంలో మాత్రం నిలబడే మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి సాంకేతికమైన అంశాలను సైతం అనర్గళంగా చెప్పడం ద్వారా ఆకట్టుకున్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చునో గణాంకాలతో సహా వివరించారు. చివరకు గోదావరి జలాలను ఉపయోగించుకుని ఆంధ్ర ప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టుల గురించి, ఏ ప్రాజెక్టు నిర్మిస్తే ప్రయోజనకరమో కూడా వివరించారు. గోదావరి జలాలను ఇటు రాయలసీమకు, నెల్లూరులోని నాయుడు పేట వరకు ఎలా తీసుకు వెళ్లవచ్చునో వివరించి విస్మయ పరిచారు. కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై ముందుగానే ప్రచారం జరగడంతో రాజకీయ పక్షాలే కాకుండా సామాన్యులు సైతం దీనిపై ఆసక్తి చూపించారు. అయితే కెసిఆర్ సాంకేతిక అంశాలను, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి సైతం సామాన్యులకు అర్థం అయ్యేట్టు మాట్లాడారు. సభ్యులకు, ప్రజలకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా అర్ధం కావడానికి తాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయాలనుకున్నానని, తనకు అవకాశం కల్పించడం ద్వారా స్పీకర్ మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి నిబద్ధత, పరిజ్ఞానం, తెలంగాణ అభివృద్ధి కోసం పడే తపన ప్రతిబింబించే విధంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ సాగింది.
కాంగ్రెస్, టిడిపి మీనహా..
ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు ప్రతిపక్షం కాంగ్రెస్, టిడిపి సభ్యులు మినహా మిగిలిన పక్షాల సభ్యులు హాజరయ్యారు. టిఆర్‌ఎస్ సభ్యుల హాజరు ఎక్కువగా కనిపించింది. ఎంఐఎం, బిజెపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల సభ్యులు హాజరయ్యారు. అంతకు ముందు రుణవిముక్తి బిల్లు పై చర్చలో పాల్గొన్న టిడిపి సభ్యులు తరువాత బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ సభ్యులు అసలు ఈరోజు సభకే హాజరు కాలేదు. అసెంబ్లీలో అధికారులు కూర్చునే గ్యాలరీలో శాసన మండలి సభ్యులు కూర్చోని ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను చూశారు.
సామాజిక మాధ్యమాల్లో ఆసక్తి
ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రజలు చాలా ఆసక్తిగా చర్చించుకున్నారు. తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు అని ఆంధ్రప్రాంతానికి చెందిన వారు సైతం పోస్టులు పెట్టారు. కాంగ్రెస్ సభ్యులు సభలో లేకపోవడం పట్ల పలువురు విమర్శించారు.