తెలంగాణ

పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఆదర్శ సిఎంగా కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటంలో భాగంగా చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు దేశానికి ఆదర్శ సిఎంగా నిలిచారని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రజెంటేషన్‌పై సభ్యుల చర్చ అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం వర్తమాన, భవిష్యత్తు అవసరాలను వివరిస్తూ ముఖ్యమంత్రి సభలో చేసిన ప్రజెంటేషన్‌కు హాజరై, ప్రభుత్వాన్ని అభినందించాల్సిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కడ తమ తప్పులు బయటపడుతాయోనన్న భయంతో ప్రజెంటేషన్‌ను బహిష్కరించి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుందని నేడు ప్రజలు భావిస్తున్నారని ఆయన వివరించారు.
ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చేందుకు అధికారంలోకి వచ్చిన 22 నెలల నుంచి అవిశ్రాంత కృషి జరుగుతోందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 20 నుంచి 30వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని వెల్లడించారు. వ్యవసాయానికి నీరు ఎక్కడుంది? ఎలా తీసుకురావాలి? పెండింగ్ ప్రాజెక్టులేమిటీ అన్న సమగ్ర సమాచారంతో, ఎంతో ముందుచూపుతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నానరు. కల్వకుర్తి ప్రాజెక్టుతో మొత్తం 3లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందడగా త్వరలోనే లక్షా 50వేల ఎకరాలకు నీరందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రాణహిత చేవేళ్ల అన్నది ఎత్తిపోతల పథకమని, దీనిపై రిజర్వాయర్ ఎత్తు పెంచారని, తగ్గించారని అవగాహన రాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.