తెలంగాణ

సాగర్ ఎడమకాల్వకు నేడు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మార్చి 31: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం ద్వారా శుక్రవారం నుండి ఎడమకాల్వకు డ్యాం అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. గత 2 నెలలుగా ఎడమకాల్వ పరిధిలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. వాయిదా వేసుకుంటూ వచ్చిన ఎడమకాల్వ నీటి విడుదల విషయంలో గురువారం అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పురుషోత్తంరాజు, ఎస్‌ఇ రమేష్‌లు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఆపై మంత్రులతో సమావేశమయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం శుక్రవారం ఉదయం 6గంటల నుండి ఎడమకాల్వకు నీటివిడుదల చేయనున్నట్లుగా వారు తెలిపారు. ఎడమకాల్వకు నీటివిడుదల చేయనున్న నేపధ్యంలో శ్రీశైలం నుండి సాగర్‌కు నీటివిడుదలను ప్రారంభించారు. 3 రోజులుగా శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు ఎటువంటి నీరు చేరుకోలేదు.
గురువారం ఉదయం వరకు శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు 2,278 క్యూసెక్కుల నీరు వస్తుండగా మధ్యాహ్నం నుండి 9వేల క్యూసెక్కుల మేరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం సాగర్ జలాశయానికి వదిలిపెడుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 508.20అడుగులు ఉండగా, కుడికాల్వ ద్వారా 3,021 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1200క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 803.40అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయంలో 30టిఎంసిల నీరు ఉండగా 770 అడుగుల మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది.

పంతం నెగ్గించుకున్న తెలంగాణ ప్రభుత్వం
ఎడమకాల్వ నీటివిడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. గత 2 నెలలుగా నల్లగొండ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రమైందని, భూగర్భజలాలు అడుగంటిపోయాయని సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయ. సిపిఎం పార్టీ అయితే ఏకంగా ఎడమకాల్వకు నీటివిడుదల చేయాలన్న డిమాండ్‌తో సాగర్‌లో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. అయినా కూడా స్పందించకపోవడంతో నిరాహారదీక్షలకు సైతం కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎవరి డిమాండ్లకు తలొగ్గకుండా ముందుగా ప్రకటించినట్లుగా ఏప్రిల్ నెలలోనే నీటివిడుదలకు నిర్ణయం తీసుకుంది. మార్చిలో నీటివిడుదల చేస్తే తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటిని పంటపొలాలకు వినియోగించుకుంటారన్న కారణంతో నీటివిడుదల చేయకుండా ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.