తెలంగాణ

సమస్యల పరిష్కారంపై దృష్టి సారించేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 31: కరవు ఛాయలు దట్టంగా అలుముకుని ఉన్న నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రానున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా, ఇదివరకు మూడు పర్యాయాలు జరిగిన పర్యటనలకు భిన్నంగా ఈసారి సిఎం పర్యటన షెడ్యూల్‌ను రూపొందించారు. కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోనున్న కెసిఆర్, జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారంపై కెసిఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారని అధికార పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను అమల్లోకి తెస్తున్న రోజునే జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా కెసిఆర్‌కు రైతుల పక్షాన ఘనంగా సన్మానించేందుకు తెరాస శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కరవు తీవ్రత వల్ల జిల్లాలో ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుని పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గత ఖరీఫ్‌లో వేసిన పంటలు సైతం 70వేల పైచిలుకు ఎకరాల్లో జిల్లా రైతులు నష్టపోయారు. జిల్లాలోని మొత్తం 36మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ, ఇంతవరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కానీ, ఇతరత్రా కరవు సహాయక చర్యలు అమల్లోకి రాలేకపోయాయి. కాగా, ప్రధాన ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారిన నిజాం షుగర్స్‌పై సిఎం కెసిఆర్ తన పర్యటన సందర్భంగా ఎలా స్పందిస్తారనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌తో పాటు ఎన్సీఎస్సెఫ్ పునరుద్ధరణ కోసం సిఎంకు విజ్ఞాపనలు సమర్పించేందుకు రైతు సంఘాల బాధ్యులు, కార్మికులు సమాయత్తమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం పనులు జిల్లాలో నత్తనడకన కొనసాగుతుండగా, సిఎం సమీక్షతోనైనా ఈ పనులు ఊపందుకుంటాయని ఆశిస్తున్నారు. తొలివిడతలో చేపట్టిన చెరువుల ఆధునికీకరణ పనుల్లో కేవలం 50శాతం వరకే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మలి విడతలో మరో 600 చెరువులకు అనుమతులు మంజూరు కానున్న నేపథ్యంలో సిఎం సమీక్షలో ఈ అంశం కీలకంగా మారనుందని స్పష్టమవుతోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 90వేల వరకు దరఖాస్తులు రాగా, జిల్లా యంత్రాంగం ఆయా నియోజకవర్గాల్లో స్థల సేకరణ ప్రక్రియను పూర్తిచేసింది. అయితే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా, గుత్తేదార్ల నుండి స్పందన శూన్యంగా మారడంతో డబుల్ బెడ్‌రూం పథకంలో అడుగు ముందుకు పడలేకపోతోంది. ఇలా జిల్లాలో అనేక సమస్యలు నెలకొని ఉండగా, వీటిపై ముఖ్యమంత్రి కెసిఆర్ తన పర్యటన సందర్భంగా సానుకూలంగా స్పందిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.