తెలంగాణ

వడగళ్ల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, మార్చి 11: ఆకాశంలో మేఘమే కనిపించని వేళ గురువారం ఒక్కసారిగా పడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వాతావరణం చల్లపడిందని ఒకపక్క సంతోషంగా ఉన్నా, మరోపక్క పంటలు దెబ్బతిని రైతాంగం, పిడుగుపాటుకు ఆప్తుల్ని కోల్పోయన కుటుంబాలు కన్నీరు మున్నీర వుతున్నాయ. గురువారం సాయంత్రం నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లవాన పంటలకు చేటు తేగా.. పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం రైతాంగాన్ని నష్టపరిచింది.
వరి పంటల కోతల సమయంలో, మామిడి, నిమ్మ, బత్తాయి, కూరగాయల తోటలు దిగుబడుల దశలో ప్రకృతి విరుచుకుపడి మరింత నష్టపరిచింది. చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో యాట శారద (28) తన వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా పిడుగుపడి దుర్మరణం చెందింది. ఇదే మండలం గొల్లపల్లిలో హనుమంతుల వెంకటయ్య (35) వ్యవసాయ భూమిలో పనిచేసుకుంటుండగా పిడుగుపడి చనిపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం ఉడుమాల్ గ్రామానికి చెందిన ఆశమ్మ (32) పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడడంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కల్వకుర్తి మండలం తలకొండపల్లిలో పిడుగుపాటుకు గణేష్ (11) మృతిచెందాడు. కరీంనగర్ జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, శంకరపట్నం మండలాల్లో వడగళ్ల వానకు వరి నేల రాలగా, మామిడి, కూరగాయలు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, శంకరపట్నం మండలంలోని ముత్తారం, కన్నాపూర్ గ్రామాలలో వడగళ్ల వర్షం కురవడంతో వరి పంట, మామిడి పూత నేల రాలింది.