తెలంగాణ

‘జబర్దస్త్’ టీంకు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మార్చి 31: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ టీంకు హుజూరాబాద్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళ్లే.. జబర్దస్త్ కార్యక్రమంలోని కొన్ని ఎపిసోడ్లలో సన్నివేశాలు, వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను, న్యాయవాదులను, జడ్జిలను, జర్నలిస్టులను, కొన్ని వర్గాల వారిని కించపరిచే వ్యాఖ్యలున్నాయని హుజూరాబాద్‌కు చెందిన న్యాయవాది వై.అరుణ్‌కుమార్ స్థానిక కోర్టులో 2014 డిసెంబర్ 4న పిటిషన్ వేశారు. దీనిపై కేసు నమోదు చేయాలని హుజూరాబాద్ పోలీసులను అదే ఏడాది డిసెంబర్ 7న ఆదేశించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది సివిల్ అంశమని పేర్కొంటూ స్థానిక డిఎస్పీ అదేశాల మేరకు కేసును ముగించారు. దీనిపై విచారణ చేయాలంటూ న్యాయవాది అరుణ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కంచె ప్రసాద్ జబర్దస్త్ టీంలో ఉన్న 22 మందికి బుధవారం సమన్లు జారీ చేశారు. జబర్దస్త్ టీంలో ఉన్న నాగేంద్రబాబు, రోజా, శ్యాంప్రసాద్, ఏడుకొండలు, నాగేశ్వర్‌రావు, సురభి చంద్రశేఖర్, లక్ష్మి, రవి, ప్రసన్న, ఫణి, శేషు, ఈటీవి నెట్‌వర్క్‌తో పాటు డైరెక్టర్ సంజయ్‌కుమార్, మల్లెమాల ఎంటర్‌ప్రైజెస్, 123 నెట్‌వర్క్ వెబ్‌సైట్‌కు మే 6న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ అయినట్లు పిటిషనర్ అరుణ్‌కుమార్, ఆయన తరపు న్యాయవాదులు కేసరి శేషయ్య, నల్ల భూమిరెడ్డిలు వెల్లడించారు.