తెలంగాణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణలో రూ. 35 వేల కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాకరమైన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. టెండర్ల ప్రక్రియను ఖరారు చేసుకోవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ, మార్గదర్శకాల ఖరారును సవాలు చేస్తూ బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణులు ఇచ్చిన సలహాలను ప్రభుత్వం పక్కనపెట్టిందంటూ నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ దాఖలు చేసిన పిల్‌లో సరైన ఆధారాలు లేవంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారావు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ రాష్ట్రప్రభుత్వం మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి సొంతంగా మదింపు వేసి షరతులను ఖరారు చేయవచ్చని, దీనికి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని పేర్కొన్నారు.