తెలంగాణ

జీపు బోల్తాపడి ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, మార్చి 28: పెళ్లి వేడుక కోసం వచ్చి తిరిగి జీపులో వెళ్తుండగా, మూలమలుపు వద్ద జీపు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటనలో మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన ఒక జీపులో పెద్దపల్లి మండంలోని కొత్తపల్లి గ్రామానికి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 15 మంది వచ్చారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల సత్తయ్య ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు అబ్బాయి తరుపు బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి వివాహ విందులో పాల్గొని తిరిగి వెళ్తుండగా కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఒక మూలమలుపు వద్ద అదుపు తప్పిన జీపు బొల్తా పడింది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముత్యాల నారాయణ (60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మరో వృద్ధుడు బొంగోని భూమయ్య (65)ను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందకుండానే మృతి చెందాడు. జీపులో ఉన్న 13 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇందులో మాధవి, కవిత, ఉమ, అర్చన, సూజాత, మహేష్, రాజులకు తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. వీరితో మాధవి, కవితల పరస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. జీపు డ్రైవర్ రాజు అతిగా మద్యం సేవించి నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. మూలమలుపు వద్ద అతి వేగంగా జీపు నడపడం వల్ల అదుపు తప్పి బోల్తాపడిందని వారు చెప్పారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.