తెలంగాణ

ఆత్మహత్య చేసుకుంటున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 28: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో పవర్‌లూం ఆసామి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్‌లో సమాచారం అందడంతో అధికార యంత్రాంగం హడలిపోయంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లలోని బివై నగర్‌కు చెందిన పవర్‌లూం వస్త్ర ఉత్పిత్తిదారుడు మంత్రి రవీందర్ నష్టాలపాలై రూ.28 లక్షల మేరకు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పెద్ద వ్యాపారులు తనను వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యతోనైనా సిరిసిల్లలో పెద్ద సేట్ల నుండి వస్త్ర ఉత్పత్తిదారులకు విముక్తి కలుగుతుందని, వేధింపులు తుగ్గుతాయని ఆశిస్తున్నానని, తన కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొంటూ ఏకంగా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావుకు వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ పంపాడు. దీనిపై మంత్రి అధికారులను ఆదేశించడంతో సోమవారం సాయంత్రం కెటిఆర్ ప్రైవేటు కార్యదర్శి కె.శ్రీనివాస్, డిఎస్పీ సుధాకర్, జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు వెంకటేశం, సిఐ విజయకుమార్ తదితరులు రవీందర్ ఇంటికి వెళ్ళి అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇక నుండి పెద్ద సేట్ల నుండి వేధింపులు లేకుండా చేస్తామని, ఆత్మహత్య పరిష్కారం కాదని అన్నారు. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయన రవీందర్ రప్పించాలని, ఇబ్బందులు రాకుండా చూస్తామని వారు భరోసా ఇచ్చారు. అనంతరం వారు రవీందర్ సమస్యలపై స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో సమీక్షిస్తూండగానే, రవీందర్ సోదరుడికి వరంగల్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. తాను వరంగల్ రైల్వే ట్రాక్‌పై ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి, వెంటనే ఫోను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీనితో కలవరానికి గురైన కుటుంబ సభ్యులు ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చి, అక్కడి రైల్వే ట్రాక్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని కోరారు. దీంతో అధికారులు అప్రమత్తమై రవీందర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

చిత్రం రవీందర్ కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్న అధికారులు