తెలంగాణ

త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 15: రాష్ట్రం లో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చే సేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. మంగళవారం మహబూ బ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాళాలలో మధ్యాహ్న భోజన నిర్వ హణను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తం లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని వివరించారు. కష్టపడే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుం డా ఇష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్న త శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు ఎక్కువగా ప్రభు త్వ కళాశాలలకే వస్తుంటారని, అలాం టి విద్యార్థులకు అధ్యాపకులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు వచ్చి విద్యను మధ్యలోనే ఆపివేస్తున్నారని, అలా కాకుం డా ఇష్టంతో విద్య డిగ్రీ వరకు పూర్తి చేస్తే కొంతమేరకు ఉద్యోగాలు లభిం చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. నేను కూడా అట్టడుగు స్థాయి నుంచే వచ్చానని, పట్టుదలతో విద్య ను అభ్యసించి నేడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నానని గుర్తు చేశారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలే తప్పా వెనకడుగు వేయరాదని సూచించారు. మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. అలాగే, ప్రతి మండల స్థాయిలో బాలికల జూనియర్ రెసిడెన్సియల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. కెజి నుండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పటికీ అందుకు తగిన విధంగా ఉపాధ్యాయుల నుండి స్పందన రావడం లేదని అన్నారు. జూనియర్ కళాశాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదివేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు.
విద్యారంగాన్ని పటిష్ఠం చేయాలి
: ప్రొఫెసర్ హరగోపాల్
కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభు త్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండ లం మొగిలిగిద్ద జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వీర్యం అవుతున్న విద్యారంగాన్ని పటిష్టం చేయడంతో పాటు కెజి నుండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డి మాండ్ చేశారు. విద్యను వ్యాపారం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ను అందించేందుకు సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారని, కానీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఉండరని వివరించారు. ప్రతి జిల్లా పరిషత్ పాఠశాలలోనే జూనియర్ కళాశాలను ఏర్పా టు చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని, అప్పుడే భవిష్యత్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.