తెలంగాణ

మోహన్‌రెడ్డి అనుచరుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ (కరీంనగర్), డిసెంబర్ 15: రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు ఆత్మహత్యకు కారకులైన కేసులో మోహన్‌రెడ్డి అనుచరులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాగమారుతి శర్మ మంగళవారం కొట్టివేశారు. ప్రసాద రావు భార్య గోమతి ఇచ్చిన ఫిర్యాదుపై ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుండి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సింగిరెడ్డి కరుణారెడ్డి, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి, సర్ధార్ పర్మిందర్ సింగ్, సిఐడి కానిస్టేబుల్ కెక్కెర్ల పర్శరాములు, అకౌంటెంట్ జ్ఞానేశ్వర్ బెయిలుకోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై సిఐడి పోలీసులు బెయిలు మంజూరు చేయకూడదని కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. న్యాయమూర్తి నాగమారుతి శర్మ మోహన్‌రెడ్డితో పాటు పలువురిపై పలు కేసులు నమోదవుతుండడం, కేసు దర్యాప్తు స్థాయిలో ఉండడంతో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఇంటి గోడ కూలి
భార్యాభర్తల మృతి
వనపర్తి, డిసెంబర్ 15: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిగోడ కూలి కావలి చెన్నమ్మ(50), కావలి కిష్టన్న (55) అనే భార్యాభర్తలు మృతి చెందారు. కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటికప్పు పాతబడిపోయి కూలి పోవడానికి సిద్ధంగా ఉండటంతో కప్పుతీసి ఆ స్థానంలో రేకులు వేసుకోవాలని భావించిన కిష్టన్న కప్పును తీసివేసి సోమవారం గోడలకు నీరు పోశారు. రాత్రివేళల్లో గోడపక్కనే మంచం వేసుకొని పడుకోగా, ఇద్దరు కుమారులు కొంత దూరంలో పడుకున్నారు. గోడకు నీళ్లు పోయడంతో రాత్రంతా నానిన గోడ తెల్లవారుజామున కూలి భార్యాభర్తలపై పడింది. దీంతో కావలి చెన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన కిష్టన్నను వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రాథమిక చికిత్సానంతరం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగానే కిష్టన్న మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఇళ్ల స్థలాలిస్తాం

ఉద్యోగులకు కెసిఆర్ హామీ

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించుటకు కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మంగళవారం జెఎసి చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆధ్వర్యంలో టిఎన్‌జిఓల సంఘం గౌరవ అద్యక్షుడు దేవిప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కారం రవిందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ తదితరులు ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. వరంగల్ జిల్లాలో టిఎన్‌జిఓ, టిజిఓ, నాల్గవ తరగతి ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయింపుకు ప్రభుత్వానికి ప్రణాళికలు పంపించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు టిఎన్‌జిఓ హౌసింగ్ సొసైటీకి కడిపికొండలోని 32 ఎకరాలు మంజూరు చేయాలని అదే విధంగా టిఎన్‌జిఓ కాలనీలో కమ్యూనిటీహాలు నిర్మాణంకు నిధులు, వడ్డేపల్లి పిజెఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణానికి కేటాయించాలని కోరారు. తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం, అదే విధంగా నాల్గవ తరగతి ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి ముఖ్యమంత్రి స్పందించి వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు ఫోన్ ద్వారా ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కడిపికొండలోని 32 ఎకరాలు, వడ్డేపల్లిలో గెజిటెడ్ ఆఫీసర్ల భవనం, టిఎన్‌జిఓ కాలనీలో కమ్యూనిటీహాలు, పెన్షనర్ల భవన్ నిర్మాణానికి వెంటనే స్థలం, నిధులు మంజూరు చేయాలని,వీటికి సంబంధించిన ప్రణాళికలు ప్రభుత్వానికి పంపించాలని సిఎం కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సమస్యను త్వరితగతి గా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింహరామును కూడా సిఎం ఆదేశించారు. సిఎంను లిసిన వారిలో టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, తెలంగాణ గెజిటెడ్ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, టిఎన్‌జిఓ హౌ సింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు.