తెలంగాణ

నేరాల అదుపునకు టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: జంటనగరాల పోలీసు కమిషనరేట్‌లలో నేరాల అదుపునకు కొత్తగా ప్రవేశపెట్టిన టెక్నాలజీని వినియోగించుకోవాలని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టంను ఆయన ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) సౌజన్యంతో ఏర్పాటైన ఈ విధానం ద్వారా నేరాలను గుర్తించడం, నేరస్తులను పట్టుకోవడం సులువవుతుంది. హోంగార్డు మొదలుకొని బ్లూకోర్టు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు, నేరస్తుల విచారణ వంటి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించవచ్చని డిజిపి అన్నారు. నగరంలో 145 లాఅండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లు, 17 సబ్ డివిజనల్ పోలీసు స్టేషన్లు, 5 జోనల్ డిసిపిలతోపాటు టాస్క్ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు, సెక్యూరింగ్, క్రైమ్ విభాగం పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేశామని డిజిపి తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఈ వీడియో విధానాన్ని ప్రవేశపెడతామని, జిల్లాల్లో ప్రతి పోలీసు స్టేషన్‌కు ఐప్యాడ్ అందజేశామన్నారు. స్మార్ట్ ఫోన్‌ల ద్వారా కూడా ఈ విధానాన్ని వినియోగించుకునేలా సాఫ్ట్‌వేర్ రూపొందించిన ఎన్‌ఐసి అధికారిణి దుర్గను ఈ సందర్భంగా డిజిపి అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విజవంతానికి ఈ విధానం ఎంతో ఉపక్రమిస్తుందని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నేరాల అదుపుతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నూతన టెక్నాలజీ వినియోగం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్, షీ టీమ్ అధికారిణి స్వాతిలక్రా, డిజి నాగిరెడ్డి, అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం కమిషనర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టంను ప్రారంభించి ప్రసంగిస్తున్న డిజిపి అనురాగ్‌శర్మ