ఆంధ్రప్రదేశ్‌

వివరణ ఇవ్వడంలో అధికారులు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటపై జరుగుతున్న న్యాయవిచారణలో ప్రతిష్టంభన ఏర్పడింది. జస్టిస్ సివై సోమయాజులు ఏకసభ్య కమిషన్ ఆరు నెలలలోపు సంఘటనకు దారితీసిన అంశాలు, బాధ్యులైన వారు ఎవరు? తదితర అంశాలతో రాష్ట్రప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. కమిషన్ గత ఏడాది సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరించగా, ఈ నెల 28నాటికి నిర్దేశించిన 6నెలల గడువు ముగుస్తోంది. ఇది తెలిసి కూడా జిల్లా కలెక్టర్ సూచన మేరకు జిల్లా అధికార యంత్రాంగం తరపు న్యాయవాది ప్రభాకరరావు సోమవారం రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగిన న్యాయవిచారణలో జిల్లా అధికార యంత్రాంగం వివరణను సమర్పించడానికి మరో రెండు వారాలు గడువు కావాలని సోమయాజులు కమిషన్‌ను కోరారు. ఫిబ్రవరి 23న విచారణ జరిగినపుడు మార్చి 5వ తేదీలోపు సాక్షులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని ఆదేశిస్తూ, ఈ అఫిడవిట్లలోని అంశాలపై అధికార యంత్రాంగం ఈనెల 19లోపు సమాధానాలు సమర్పించాలని జస్టిస్ సోమయాజులు కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా సాక్షులు తమ అఫిడవిట్లను మార్చి 5లోపు సమర్పించారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం తన వాదనతో కూడిన అఫిడవిట్‌ను కమిషన్‌కు సమర్పించలేపోయింది. సరికదా తొక్కిసలాట సంఘటన సమాచారాన్ని అందించాల్సిన శాఖల్లో కొన్ని శాఖల నుండి వివరణ అందలేదని, అందువల్ల మరో రెండు వారాలు గడువు కావాలని జిల్లా కలెక్టర్ లేఖ రాయటంతో గడువు ఇవ్వాల్సిందిగా అధికారుల తరపు న్యాయవాది ప్రభాకరరావు జస్టిస్ సోమయాజులు కమిషన్‌ను కోరారు. నివేదిక సమర్పణకు గడువు సమీపిస్తుంటే మరో రెండు వారాలు గడువు అంటే ఎలా అని జస్టిస్ సోమయాజులు ప్రశ్నించారు. చివరకు ఈ నెల 29లోపు కమిషన్‌కు ప్రభుత్వ వివరణను సమర్పిస్తామని ఒప్పుకున్నారు.
అధికారులు తమ వివరణను సమర్పించలేకపోవటం సరికాదని సాక్షులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ఎప్పుడు జరిగేది మీడియా ద్వారా తెలియచేస్తామని జస్టిస్ సోమయాజులు చెప్పారు.
సాక్షులకూ సమాచారాన్నివ్వాల్సిందే!
సాక్షుల అఫిడవిట్లను అధికారుల తరపు న్యాయవాదికి అందించినట్టే, తాము కోరిన అధికారిక పత్రాలు, సమాచారాన్ని తమకు అందించాలని న్యాయవాది ముప్పాళ్ల కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కమిషన్ సోమయాజులు తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని చెప్పారు.

న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ సోమయాజులు